A. నీతిమంతుల మార్గము.
1. (1) నీతిమంతుడు చేయనిది ఏంటి
దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక… ధన్యుడు
a. ధన్యుడు: యెషెర్ అనే హెబ్రీ పదం (సంతోషము మరియు తృప్తి కలిగి ఉండడము అనే అర్ధం వచ్చే పదం) ఇక్కడ ధన్యుడుగా తర్జుమా చేయబడింది. యెషెర్ అనేది అషర్ అనే హెబ్రీ పదానికి ఒక రూపం. “సరిగా ఉండడం” లేదా “నేరుగా ఉండడం” అని దాని అర్ధం. ధన్యుడు అనే పదం దేవునితో నేరుగా ఉన్న మనిషి యొక్క జీవితంలో సంతోషం, ఆశీర్వాదం, సంతృప్తి గురించి మాట్లాడుతుంది. నీతిమంతుడు ధన్యుడు, సంతోషముగా ఉండేవాడు.
- “ధన్యుడు అంటే అత్యున్నతమైన సంతోషము. నిజానికి, హెబ్రీ భాషలో ఆ పదం బహు వచనం, అనగా అనేక ఆశీర్వాదాలను లేదా ఆశీర్వాదం యొక్క పరిమాణాన్ని సూచిస్తుంది.” (బాయ్సి)
b. నడువక… నిలువక … కూర్చుండక: ధన్యుడు కొన్ని విషయాలు చెయ్యడు. తాను నడవని ఒక దారి, నిలువని ఒక మార్గము, కూర్చోని ఒక స్థలం ఉన్నాయి.
- ఇవి ఆలోచనను, ప్రవర్తనను, సంబంధించిన దాని గురించి మాట్లాడుతుందని చెప్పవచ్చు. నీతిమంతుడు మరియు భక్తిహీనుల వారి ఆలోచనల్లో, ప్రవర్తనలో, ఎవరికి చెందినవారు అనే దాంట్లో వేరుగా ఉన్నారు.
- ఇతరులు ఇందులో పాపములో పురోగతిని చూసారు. దీనంతటిలో నేర్చుకోవాల్సిన గొప్ప పాఠమేంటంటే పాపము పురోగతి చెందుతుంది. ఒక చెడు ప్రవృత్తి ఇంకొకదానికి దారితీస్తుంది. దుష్టుల ఆలోచన చొప్పున నడిచేవాడు తప్పక చెడు పనులు చేస్తాడు; మరియు చెడు కార్యాలకు తన్ను తాను విడిచిపెట్టుకునే వాడు తన జీవితాన్ని దేవుని నుండి భ్రష్టత్వములోకి వెళ్తాడు.
c. దుష్టుల ఆలోచన చొప్పున నడువక: దుష్టులకు ఒక ఆలోచన ఉంటుంది, కాని నీతిమంతుడు దాని చొప్పున నడువడు. రకరకాలుగా మనకు వచ్చే సలహాలలో, దుష్టుల ఆలోచనకు ఎలా దూరంగా ఉండాలో నీతిమంతునికి తెలుసు.
- మొదటగా, నీతిమంతునికి దుష్టుల ఆలోచనను ఎలా గుర్తించాలో తెలుసు. అయితే చాలా మంది ఇక్కడ విఫలమౌతారు. ఆలోచన దైవికమా లేదా దుష్టమైనదా అనేదే వారు పరిగణలోకి తీసుకోరు. సలహా వింటారు, “ఇది దేవుని నుంచా లేక దుష్టుని నుంచా” అని ఆలోచించకుండానే వారు ఒప్పుకుంటారు.
- ఒక దుష్టమైన ఆలోచన తన నుండి కూడా రాగలదని నీతిమంతుడు గుర్తించగలడు. మన సొంత మనస్సాక్షి, మన సొంత మనస్సు, మన సొంత హృదయం కూడా దుష్టమైన ఆలోచనను ఇవ్వగలదు.
- నీతిమంతునికి దేవుని ఆలోచన ఎక్కడ కనుగొనాలో పూర్తిగా తెలుసు: నీ శాసనములు నాకు సంతోషకరములు అవి నాకు ఆలోచనకర్తలైయున్నవి (కీర్తనలు 119:24). దేవుని వాక్యమే ఎప్పుడూ సరైన ఆలోచనకర్త, మరియు ఆలోచన అవసరమైన వారికి దైవ ఆలోచనకర్తలు ఎప్పుడూ సత్యమైన దేవుని వాక్యమును తీసుకొని వస్తారు.
d. పాపుల మార్గమున నిలువక: పాపులు నిలిచే ఒక మార్గం ఉంది, అయితే తాను ఆ మార్గానికి చెందినవాడు కాదని నీతిమంతునికి తెలుసు. మార్గము అనగా ఒక దారి, ఒక దిశ – అయితే పాపులు ప్రయాణించే దిశలో నీతిమంతుడు వెళ్ళడు.
- కొందరు మాత్రమే ప్రయాణించే మార్గమున వెళ్ళడానికి నీతిమంతుడు భయపడడు, ఎందుకంటే అది ఆశీర్వాదానికి, సంతోషానికి, నిత్యజీవానికి వెళ్తుందని తనకి తెలుసు. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి; నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునైయున్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు (మత్తయి 7:13).
- నీతిమంతునికి కీర్తనలు 16:11లోని ధైర్యం ఉంటుంది: జీవమార్గమును నీవు నాకు తెలియజేసెదవు నీ సన్నిధిని సంపూర్ణసంతోషము కలదు నీ కుడిచేతిలో నిత్యము సుఖములు కలవు. దేవుని మార్గము మంచి మార్గము.
e. అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక: అపహాసకులు కూర్చొని దేవుని మనుష్యులను దేవుని విషయాలను విమర్శించడానికి ఇష్టపడతారు. నీతిమంతుడు ఆ చోట కూర్చోడు.
- ఇతరులు క్రైస్తవులను తక్కువ చేసినప్పుడు, వారితో కూర్చొని వారిని విమర్శించడం సులభమైనది. అది ఎందుకు సులభమైనదంటే, క్రైస్తవులను విమర్శించడానికి అనేక విషయాలు ఉంటాయి. అయితే అది తప్పు ఎందుకంటే అప్పుడు మనము అపహాసకులు కూర్చుండు చోట కూర్చుంటున్నాం కాబట్టి.
- బదులుగా, మనం యేసుని వెంబడిస్తున్నందుకు గర్వంగా ఉండాలి. “పూర్తిగా దేవుని కొరకు ఉండండి; మీ రంగులను ఎన్నటికీ దాయక వాటిని విప్పండి కాని వాటిని గోడకు కొట్టి పరిశుద్ధులను అపహసించే వారితో ‘ఒకవేళ క్రీస్తుని వెంబడించే వారిని తిట్టాలని మీరనుకుంటే నన్ను తిట్టండి.. అయితే మీకు నచ్చినా నచ్చకపోయినా నేను క్రీస్తును ప్రేమిస్తున్నాను అనే విషయం తెలుసుకోండి’ అని చెప్పండి” (స్పర్జియన్)
2. (2) నీతిమంతుడు చేసేది ఏంటి.
యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు.
a. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు: కీర్తనలంతటిలో, యెహోవా ధర్మశాస్త్రము అనేది కేవలం బైబిల్లోని మొదటి ఐదు పుస్తకాలలో ఉన్న “ధర్మశాస్త్రం” మాత్రమే కాదు గాని దేవుని యొక్క వాక్యమంతటిని, వివరించడానికి వాడబడింది. నీతిమంతుడు దేవుని వాక్యంలో ఆనందిస్తాడు.
- మిమ్మల్ని సంతోషపరిచేది ఏది? మిమ్మల్ని ఉత్తేజపరిచేది ఏది? మీకు ఏది ప్రాముఖ్యమో తెలుసుకోడానికి ఇది మంచి మార్గం. ఒకవేళ వ్యక్తిగత ఆనందం ఒక్కటే మిమ్మల్ని సంతోషపరచినట్లైతే, మీరు స్వార్ధపరులు. ఒకవేళ కుటంబంతో లేదా స్నేహితులతో ఉండడం మిమ్మల్ని సంతోషపరచినట్లైతే, అది మంచిదే కాని గొప్పది కాదు. నీతిమంతుడు తన ఆనందమును ధర్మశాస్త్రమునందు కనుగొంటాడు.
- నేను దేవుని వాక్యం లేకుండా పరలోకంలో జీవించలేను గాని, నరకంలో చాలినంతగా జీవించగలను అని మార్టిన్ లూథర్ చెప్పాడు.
- “మనుష్యునికి ఆనందమనేది ఉండాలి. తన హృదయం ఖాళీగా ఎప్పుడూ ఉండదు. ఉత్తమమైన విషయాలతో నింపబడకపోతే, నిరాశపరచే, అనర్హమైన వాటితో నింపబడుతుంది.” (స్పర్జియన్)
- ఒక వ్యక్తి దేనిలోనైనా ఆనందిస్తే, దానిని చేయమని లేదా ఇష్టపడమని మనం వేసుకోవాల్సిన పని లేదు. తనంత తానే అది చేస్తాడు. ఎంతగా నువ్వు దేవుని వాక్యము కోసం ఆకలితో ఉన్నావు అనే దానితో దేవుని వాక్యమందు నీ ఆనందమును కొలవవచ్చు.
b. దివారాత్రము దానిని ధ్యానించువాడు: నీతిమంతుడు దేవుని వాక్యమును తలంచుకుంటాడు. కేవలం విని మరచిపోడు కాని దాని గురించి ఆలోచిస్తాడు. క్రైస్తవులు దేవుని వాక్యమును ధ్యానించాలి!
- లోకపరమైన ధ్యానంలో, మన మనస్సును ఖాళీగా చేసుకోవడమే ధ్యేయం. ఇది ప్రమాదకరమైనది, ఎందుకంటే ఖాళీ మనస్సు మోసమును మరియు దురాత్మను ఆహ్వానిస్తుంది. అయితే క్రైస్తవ ధ్యానంలో, మీ మనస్సును దేవుని వాక్యంతో నింపుకోవడమే ధ్యేయం. ప్రతి వచనమును, వాక్య భాగమును జాగ్రత్తగా ఆలోచించి, మన జీవితంలో దానిని అమలుచేసి తిరిగి దేవునికి ప్రార్ధించడం ద్వారా దీనిని చేయవచ్చు.
- “ధ్యానము అనగా వాక్యమును నెమరు వేసి, ఆ వాక్యంలోని మధురమును, పోషక విలువలను మన హృదయంలోకి మరియు జీవితంలోకి తీసుకొని వస్తుంది: భక్తులు మరి ఎక్కువగా ఫలించడానికి ఇదే మార్గం” (ఆశ్వుడ్, స్పర్జియన్ ఉదాహరించినది)
- అనేకులు కేవలం చదువుతారు కానీ ధ్యానించారు. “చదవడం మాత్రమే మనకు మంచి చేయదు; అయితే లోపల ఆత్మ దానిని తిని జీర్ణించుకోవాలి. ఒక బోధకుడు ఒకసారి నాతో ఏం చెప్పాడంటే, మోకాళ్ళపైన బైబిల్ అంతా ఇరవై ఒక్క సార్లు చదివాడంట అయితే ఎప్పుడూ సిద్ధాంతం యొక్క లోతు తనకి అర్ధం కాలేదంటే. బహుశా అవ్వదు. చదవడానికి చాలా అసౌకర్యంగా ఉండే స్థానమది. ఒకవేళ ఒక సులువైన కుర్చీలో కూర్చొని ఉంటే తనకి బాగా అర్ధమయ్యి ఉండేది.” (స్పర్జియన్)
- నీతిమంతునికి ఒక రోజులో రెండు సార్లు మాత్రమే దేవుని వాక్యం తన మనస్సులో ఉంటుంది; దివారాత్రము.
3. (3) నీతిమంతుడు ఏ విధంగా ఆశీర్వదించబడతాడు.
అతడు నీటికాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలెనుండును అతడు చేయునదంతయు సఫలమగును.
a. అతడు నీటికాలువల యోరను నాటబడినదై… చెట్టువలెనుండును: నది పక్కన ఉండే చెట్టుకి నిరంతరం నీరు అందుతుంది.అది ఎన్నటికీ వాడిపోదు, ఎందుకంటే దానికి కావలసింది ఎప్పుడూ అందుతుంది కాబట్టి. మనకు ఎప్పుడూ ఎదో ఒక అవసరం ఉంటుందంటే, మనము నీటికాలువల యోరను నాటబడినామా లేదా అని పరీక్షించుకోవడం మంచిది.
- ఈ చెట్టు యొక్క వేరులు లోపలి వెళ్లి చాలా బలంగా స్థిరంగా ఉంటుంది. నీతిమంతుని జీవితాన్ని తన బలంతో, స్థిరత్వంతో గుర్తించవచ్చు.
b. తన కాలమందు ఫలమిచ్చు: నీతిమంతుడు ఆత్మ ఫలమును ఫలిస్తాడు (గలతీయులకు 5:22-23). ఈ చెట్టు నుండి ఫలము సహజంగానే వస్తుంది, ఎందుకంటే అది నీటికాలువల యోరను నాటబడినది కాబట్టి. అది జీవాధారంలో నిలిచియుంది. యోహాను 15:5లో యేసు ప్రభువు ఫలించుట గురించి చెప్పినట్లుగా, మనము ఆయన యందు నిలచియుంటే. ఫలమునకు ఒక కాలము ఉంది. కొందరు నీతిమంతులుగా నడవడం ప్రారంభించిన తరువాత, ఫలము వెంటనే పొందకపోవుట చూచి నిరాశపడతారు. వారు తన కాలమందు ఫలమిచ్చు వరకు ఎదురు చూడాలి.
- “దేవుని తోటలో ఫలించని చెట్లు లేవు, అయితే ఆపిల్ చెట్టుకి కొన్ని సార్లు ఉన్నట్లుగా, ఫలించని కొంత సమయం ఉండవచ్చు; కాని అవి గొప్పగా పుంజుకుంటాయి.” (ట్రాప్)
c. ఆకు వాడక: గోధుమ రంగు, చనిపోయిన, వాడిపోయిన ఆకులు మరణానికి వాడిపోడానికి గురుతులు. నీతిమంతునికి ఇలాంటి మరణము మరియు వాడిపోవడమనే గురుతులు ఉండవు; ఆయన “ఆకులు” పచ్చగా సజీవంగా ఉంటాయి.
d. అతడు చేయునదంతయు సఫలమగును: నీతిమంతునికి “మిడాస్ స్పర్శ” ఉందని కాదు, తాను చేసే ప్రతీది తనను ధనవంతునిగా సౌకర్యవంతంగా చేస్తుందని కాదు.అయితే నీతిమంతుని జీవితంలో, ప్రతి దాంట్లో నుంచి దేవుడు కొంత మంచిని అద్భుతమైన దానిని తీసుకొని వస్తాడు. కఠినమైన పరిస్థితులు కూడా కొంత సఫలతను తీసుకొని వస్తుంది.
B. దుష్టుల మార్గము.
1. (4) దుష్టుల ప్రమాదకరమైన స్థలము
దుష్టులు ఆలాగున నుండక గాలి చెదరగొట్టు పొట్టువలె నుందురు.
a. దుష్టులు ఆలాగున నుండక: నీతిమంతుని గురించి నిజమైన ప్రతీది – అనగా చెట్టు వలె స్థిరత్వం, నిరంతర జీవం మరియు పోషణ, ఫలభరితం, జీవించి ఉండడం, మరియు అభివృద్ధి అనేవి దుష్టుల విషయంలో ఉండవు.
- చాలా సార్లు దుష్టులకు ఇవి ఉన్నాయని అనిపించవచ్చు, కొన్ని సార్లు నీతిమంతుని కంటే ఎక్కువ ఉన్నాయని కూడా అనిపించవచ్చు. కాని అది నిజం కాదు. దుష్టుని జీవితంలో ఇవన్ని క్షణికమైనవే; వారికి ఇవేవి నిజంగా లేవనే చెప్పొచ్చు.
b. గాలి చెదరగొట్టు పొట్టువలె నుందురు: పొట్టు అనేది గింజ చుట్టూ ఉండే పల్చని “పొర”, గింజని పిండిగా మార్చేకంటే ముందు ఆ పొరని తీసివేయాలి. ధాన్యమును గాలిలో విసిరేస్తే ఆ గాలికే చెదరిపోయేంత పల్చగా ఉంటుంది పొట్టు. దుష్టులు అంత అస్థిరత్వంగా, విషయం లేని వారుగా ఉంటారు.
- పొట్టు గురించి స్పర్జియన్: “అంతర్గతంగా విలువలేని, మృతమైన, పనికిరాని, విషయం లేని, సులువుగా అటు ఇటు వెళ్ళేది.” చెట్టుకి పొట్టుకి మధ్య చాలా తేడా ఉంది.
2. (5) దుష్టుల ప్రమాదకరమైన భవిష్యత్తు.
కాబట్టి న్యాయవిమర్శలో దుష్టులును నీతిమంతుల సభలో పాపులును నిలువరు.
a. కాబట్టి న్యాయవిమర్శలో దుష్టులు… నిలువరు: దుష్టులకు ఎలాంటి “బరువు” ఉండదు కాబట్టి, తీర్పు దినమందు వారు తక్కువగా ఉంటారు. దానియేలు గ్రంథంలో, రాజైన బెల్షస్సరు గురించి చెప్పబడినట్లు, ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితివి (దానియేలు 5:26).
b. నీతిమంతుల సభలో పాపులును నిలువరు: రాబోయే కాలమందు ఇది నిజము, ఎందుకంటే పాపులు నీతిమంతులతో పాటు ఒకే మహిమాన్వితమైన భవిష్యత్తును పొందుకోలేరు. అది ఇప్పుడును నిజమే, ఎందుకంటే పాపులు నీతిమంతుల సభకు చెందినవారు కాదని మిగితా పాపులను అడిగినప్పుడు వారు భావిస్తారు.
3. (6) సారాంశం: నీతిమంతుల మార్గము మరియు దుష్టుల మార్గము.
నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియును దుష్టుల మార్గము నాశనమునకు నడుపును.
a. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియును: పరలోకంలో ఉన్న ప్రేమించే దేవునికి వారి మార్గం తెలుసు మరియు వారిని కాపాడి భద్రపరుస్తాడు కాబట్టి, నీతిమంతులు సమాధానంగా ఉండగలరు.
- “లేదా, హెబ్రీలో పూర్తిగా ఉన్నట్టుగా, ‘నీతిమంతుల మార్గము యెహోవా తెలుసుకుంటున్నాడు’. ఆయన వారి మార్గమును నిరంతరం చూస్తూ ఉన్నాడు, అది చాలా సార్లు పొగ మంచులో, చీకటిలో అయినప్పటికీ అది యెహోవాకు తెలుసు” (స్పర్జియన్)
b. దుష్టుల మార్గము నాశనమునకు నడుపును: దుష్టుల మార్గము నాశనమునకు నడుపుతుంది. వారు విశాలమైన మార్గంలో ఉన్నారు. ఇప్పుడు వారికది సౌకర్యంగా ఉంది, అనేకులు వారితో ఉండవచ్చు కానీ చివరకు అది నాశనమునకు నడుపును.
c. అపొస్తలుల కార్యములులో, కనీసం నాలుగు సార్లు క్రైస్తవ్యం ఒక మార్గమని పిలువబడింది. ఖచ్చితముగా అది నీతిమంతుల మార్గమే, దుష్టుల మార్గము కాదు. నీవు ఏ మార్గంలో ఉన్నావు?