ఫిలేమోనుకు

“ఇది గుర్తించదగిన పత్రిక, ప్రతి పదానికి తగిన లోతైన అర్ధం, ప్రతి అక్షరానికి తగిన విషయం ఉన్న విలువైన పత్రిక. పారిపోయిన బానిస పొందుకున్న ఒక నీచమైన విషయం నుండి, అపొస్తలుడైన పౌలు ఒక పరలోక గ్రద్ద వలె ఎగురుతూ పరలోక అంశాన్ని వేగంగా చెప్పే పత్రిక.” (జాన్ ట్రాప్)

A. వందనము మరియు పరిచయము

1. (1) రచయిత మరియు పాఠకుడు

క్రీస్తుయేసు ఖైదీయైన పౌలును, సహోదరుడైన తిమోతియును మా ప్రియుడును జతపనివాడునైన ఫిలేమోనుకును

a. ఖైదీయైన పౌలును: అపొస్తలుల కార్యములు 28:30-31లో వివరించబడినట్లుగా పౌలు తన రోమా జైలుశిక్షలో ఉన్నప్పుడు ఈ క్లుప్త లేఖ రాయబడింది. ఎఫెసులో తాను జైలుశిక్ష అనుభవించేటప్పుడు ఈ పత్రిక రాసాడని కొందరు నమ్ముతారు, కాని ఇది అసంభవమైన అవకాశం.

b. క్రీస్తుయేసు ఖైదీ: ఎప్పటిలాగానే, రోమాకు గాని, పరిస్థితులకు గాని లేదా తనకు చట్టపరమైన సమస్యలు తీసుకువచ్చిన మతసంబంధమైన నాయకులకు గాని తనను ఖైదీగా భావించలేదు (అపొస్తలుల కార్యములు 23-24). పౌలు ఒక క్రీస్తుయేసు ఖైదీ.

c. మా ప్రియుడును… ఫిలేమోనుకును: పౌలు కొలొస్సిలో నివసిస్తున్న క్రైస్తవ సహోదరుడైన ఫిలేమోనుకు రాసాడు. కొత్త నిబంధనలో ఇదొక్క చోటే ఫిలేమోను తన పేరుతో ప్రస్తావించబడ్డాడు, అయితే పౌలుకు తాను ప్రియుడు అని మనకు తెలుసు.

  • తన వందనం లో ప్రాముఖ్యమైనది ఎదో లేనందువలన, ఫిలేమోనుతో పౌలుకున్న స్నేహం కనబడుతుంది. పౌలు సంఘాలకు లేదా వ్యక్తులకు రాసిన 13 పత్రికల్లో, తిమ్మిదింట్లో ప్రారంభ వచనలో తనను తాను అపొస్తలునిగా పిలుచుకున్నాడు. ఈ పత్రికలో (ఫిలిప్పీయులకు, 1 మరియు 2 థెస్సలొనీకయులకుతో సహా), పౌలు తనను అపొస్తలునికంటే ఎక్కువగా స్నేహితునిగా పిలుచుకున్నాడు.

2. (2-3) ఫిలేమోను యొక్క కుటుంబీకులకు వందనములు.

మన సహోదరియైన అప్ఫియకును, తోడి యోధుడైన అర్ఖిప్పునకును, నీ యింట ఉన్న సంఘమునకును శుభమని చెప్పి వ్రాయునది. మన తండ్రియైన దేవునినుండియు ప్రభువైన యేసుక్రీస్తునుండియు కృపయు సమాధానమును మీకు కలుగును గాక.

a. మన సహోదరియైన అప్ఫియకును: బహుశా అప్ఫియ ఫిలేమోను యొక్క భార్యయు, అర్ఖిప్పు తన కుమారుడునై యుండవచ్చు. పౌలు యొక్క పత్రికల్లో, ఇలా కుటుంబీకులను సంబోధించిన తీరు ప్రత్యేకమైనది, కాని ఫిలేమోనుకు రాసిన లేఖలోని విషయమును పరిగణలోకి తీసుకుంటే ఇందుకు గల కారణం అర్ధమౌతుంది. ఈ పత్రికలో, క్రీస్తుని కలిసి పౌలు వద్ద ఆశ్రయం పొందుతున్న ఒక పారిపోయిన బానిస గురించి పౌలు ఫిలేమోనుకు విజ్ఞప్తి చేస్తున్నాడు. ఆ రోజుల్లో, ఫిలేమోను భార్యయైన అప్ఫియ ఆ ఇంట్లో ఉన్న బానిసలందరికి యజమానురాలిగా ఉంది, కాబట్టి ఈ పత్రిక తనకి సంబంధించినది కూడా.

b. నీ యింట ఉన్న సంఘమునకును: దీని అర్ధం ఏంటంటే, కొలొస్సిలో ఉన్న సంఘము లేదా సంఘములోని కొంతమంది ఫిలేమోను యొక్క యింటిలో కలుసుకునేవారు. ఆది క్రైస్తవులకు చర్చి భవనాల కోసం సొంత ఆస్తులు ఉండేవి కావు. యూదులకు ప్రార్ధనా మందిరాలు ఉండేవి కానీ క్రైస్తవులు సంఘ సభ్యుల గృహాలలోనే కలుసుకునేవారు. ఒక పట్టణములోని క్రైస్తవులు వేరు వేరు గృహ సంఘాలలో కూడుకునేవారు, ఆ పట్టణ కాపరి ఆ గృహ సంఘాలను పర్యవేక్షిస్తుండేవాడు. గృహ సంఘాలు రోమీయులకు 16:4 మరియు కొలొస్సయులకు 4:15లో కూడా ప్రస్తావించబడ్డాయి.

  • “మూడో శతాబ్దము వరకు ఆరాధించడానికి సంఘ భవనాలు ఉన్నట్లు ఎలాంటి ఆధారము లేదు. అన్ని కూడా ఒక వ్యక్తి యొక్క గృహాలనే సూచిస్తున్నాయి. రోమాలో, అనేక పురాతన సంఘాలు క్రైస్తవులు ఆరాధించడానికి ఉపయోగించిన గృహాల స్థలంలోనే నిర్మించబడ్డాయి.” (ఓస్టర్లీ)
  • స్పర్జియన్ ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పాడు, ఫిలేమోనుకు తన గృహంలోనే కూడుకుని ఒక సంఘం ఉంది. విశ్వాసులకు వారి గృహం కూడా ఒక సంఘంగా ఉండాలని, ప్రతి గృహం ఒక మంచి సంఘానికి ఉన్న లక్షణాలు కలిగియుండాలని ఇది సూచిస్తుంది.
    • మారు మనస్సు పొంది రక్షింపబడిన ప్రజలను కలిగియుండడం
    • కలిసి ఆరాధించడం
    • కలిసి ఐకమత్యంగా ఉండడం
    • పొరపాటులను సరిచేసుకోవడం
    • ఎప్పుడూ బోధించుచు ఉండడం
    • బయట ఉన్న వారికి పరిచర్య చేసే హృదయం కలిగి యుండడం

c. కృపయు సమాధానమును మీకు కలుగును గాక: పౌలు యొక్క ప్రతి పత్రికలో ఉన్నట్లుగా, తాను వాడుకగా చెప్పే కృప మరియు సమాధానము యొక్క వందనాన్ని చెప్పాడు. అయినప్పటికీ, ఈ వందన వచనం సంఘమంతటికీ కాదు గాని, ఒక వ్యక్తిగా ఫిలేమోనుకు మాత్రమే. ఇది పౌలు రాసిన పత్రికల్లో, ఈ పత్రికను ప్రత్యేకపరుస్తుంది.

  • కాపరికి సంబంధించిన వేరే పత్రికలు (1 మరియు 2 తిమోతికి మరియు తీతుకు) కూడా మొదటగా వ్యక్తులకే రాయబడ్డాయి, కాని అందులోని విషయము సంఘంలోని ప్రతి ఒక్కరికి సరిపడే ఉద్దేశ్యాన్ని సూచిస్తుంది.
  • “తన సుదీర్ఘమైన జీవిత కాలంలో, అపొస్తలుడైన పౌలు తన అనేక స్నేహితులకు మరియు శిష్యులకు రాయవలసిన లెక్కలేని పత్రికల్లో ఇది కేవలం ఒక నమూనా మాత్రమే” (లైట్ఫుట్)

3. (4-7) పౌలు ఫిలేమోనును బట్టి దేవునికి కృతజ్ఞలు చెల్లిస్తున్నాడు.

నీ ప్రేమనుగూర్చియు, ప్రభువైన యేసు ఎడలను సమస్త పరిశుద్ధులయెడలను నీకు కలిగియున్న విశ్వాసమును గూర్చియు నేను విని నా ప్రార్థనలయందు నీ నిమిత్తము విజ్ఞాపనము చేయుచు, ఎల్లప్పుడు నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, క్రీస్తునుబట్టి మీయందున్న ప్రతి శ్రేష్ఠమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకముగా ఎరుగుటవలన ఇతరులు నీ విశ్వాసమందు పాలివారగుట అనునది కార్యకారి కావలయునని వేడుకొనుచున్నాను. సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమనుబట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణయు కలిగెను.

a. నా ప్రార్థనలయందు నీ నిమిత్తము విజ్ఞాపనము చేయుచు, ఎల్లప్పుడు నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచువేడుకొనుచున్నాను: పౌలు ఫిలేమోను గురించి తరచూ ప్రార్ధించాడు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ప్రార్ధించాడు. పౌలుకు ఫిలేమోను అంతగా ఆశీర్వాదంగా ఉన్నాడు కాబట్టే పౌలు తరచుగా ప్రార్ధించి ఆయనకు కృతజ్ఞుడైయున్నాడు.

b. నీ ప్రేమనుగూర్చియు, ప్రభువైన యేసు ఎడలను సమస్త పరిశుద్ధులయెడలను నీకు కలిగియున్న విశ్వాసమును గూర్చియు నేను విని: పౌలు ఫిలేమోను యొక్క ప్రేమను విశ్వాసమును గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులుచు చెల్లించుచున్నాడు – మొదటగా ప్రభువైన యేసు ఎడలను తరువాత సమస్త పరిశుద్ధులయెడలను. కొత్త నిబంధనలో “పరిశుద్ధులు” అనే పదం ఎదో కొంత మంది అసాధారణమైన క్రైస్తవులనే కాక ప్రతి నిజ క్రైస్తవునికి వర్తిస్తుంది.

c. నీ విశ్వాసమందు పాలివారగుట: ఫిలేమోనులో దేవుడు చేసిన కార్యమును (మీయందున్న ప్రతి శ్రేష్ఠమైన వరము విషయమై) అతను అర్ధం చేసుకున్నాడు కాబట్టి తన విశ్వాసమందు పాలివారగుట అనునది కార్యకారి కావలయునని ఫిలేమోను కొరకు పౌలు ప్రార్ధించాడు.

  • సమర్ధవంతమైన సువార్త పరిచర్యకు ఇది పునాది: దేవుడు ముట్టి మార్చిన నిండైన జీవితం. దేవుడు ఫిలేమోను జీవితంలో ప్రతి శ్రేష్ఠమైన వరము అనుగ్రహించాడు. ఇప్పుడు, ఫిలేమోనుయు మరియు తన విశ్వాసమందు పాలివారును దానిని గుర్తించడమే విషయం. ఈ శ్రేష్టమైన వరములు అర్ధం చేసుకోబడినప్పుడు, అనేకులు యేసు ప్రభువు చెంతకు వస్తారు. ఒక్కోసారి ఇతరులు మన విశ్వాసమందు పాలివారగుట అనునది ఎందుకు కార్యకారి కాదంటే దేవుడు మనకు అందించిన ప్రతి శ్రేష్ఠమైన వరము మనము గ్రహించకపోవడం వలనో లేదా ఇతరులకు సరిగా చెప్పకపోవడం వలనో.
  • నీ విశ్వాసమందు పాలివారగుట: విశ్వాసము ద్వారా పొందిన భౌతిక విషయాలలో ఇతరులు పాలివారగుట అనేది పౌలు యొక్క ఉద్దేశ్యం అయ్యి ఉండవచ్చు. పాలివారగుటకు ప్రాచీన గ్రీకు పదం కోయినోనియా, కొన్ని సార్లు పౌలు కోయినోనియా అనగా “సహవాసము, పాలుపంచుకోవడము” అనే పదాన్ని ఇవ్వడాన్ని వివరించడానికి వాడాడు (2 కొరింథీయాలకు 8:4; 2 కొరింథీయాలకు 9:13; రోమీయులకు 15:26).
  • “పేద క్రైస్తవుల యెడల ఫిలేమోను చేసిన దాతృత్వము గురించి ఇక్కడ అపొస్తలుడు మాట్లాడుతున్నాడు.” (క్లార్క్)

d. సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున: ఫిలేమోను ఇతర క్రైస్తవుల అవసరాలను ఎంత అద్భుతముగా తీర్చాడో పౌలు జ్ఞాపకాము చేసుకుంటున్నాడు. అతను ఇతరుల హృదయములను విశ్రాంతి పొందేలా చేసాడు.

B. ఒనేసిము తరపున పౌలు యొక్క మనవి

1. (8-11) పౌలు ఒనేసిము గురించి ఫిలేమోనుతో మాట్లాడుతున్నాడు

కావున యుక్తమైనదానినిగూర్చి నీ కాజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహు ధైర్యము కలిగియున్నను, వృద్ధుడను ఇప్పుడు క్రీస్తుయేసు ఖైదీనైయున్న పౌలను నేను ప్రేమనుబట్టి వేడుకొనుట మరి మంచిదనుకొని, నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఒనేసిము కోసరము నిన్ను వేడుకొనుచున్నాను. ​అతడు మునుపు నీకు నిష్‌ప్రయోజనమైనవాడే గాని, యిప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైనవాడాయెను.

a. కావున యుక్తమైనదానినిగూర్చి నీ కాజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహు ధైర్యము కలిగియున్నను, … ప్రేమనుబట్టి వేడుకొనుట మరి మంచిదనుకొని: పౌలు ఫిలేమోను యొక్క సహాయము కోరుతున్నాడనేది స్పష్టము. అయితే తాను అడిగేకంటే ముందు, ఆజ్ఞాపించుటకు బదులుగా ప్రేమనుబట్టి వేడుకుంటున్నాడు. అయితే, యుక్తమైనదానినిగూర్చి ఆజ్ఞాపించుటకు తనకు హక్కు ఉన్నప్పటికీ ప్రేమనుబట్టి వేడుకుంటున్నాడనేది స్పష్టం చేసాడు.

  • చాలా సార్లు అధికారపూర్వకమైన ఆజ్ఞ కంటే ప్రేమతో కూడిన మనవి మంచిది. పరిస్థితులు తలెత్తినప్పుడు ఆజ్ఞాపించడానికి పౌలు వెనుకాడలేదు (1 కొరింథీయాలకు 5:4-5), అయితే జ్ఞానముతో తనకు ఎప్పుడు ప్రేమతో వేడుకోవాలో తెలుసు.

b. వృద్ధుడను ఇప్పుడు క్రీస్తుయేసు ఖైదీనైయున్న పౌలను నేను: పౌలు ఫిలేమోను యొక్క సహాయము అడుగుతున్నాడనేది స్పష్టము. అయితే తాను అడిగేకంటే ముందు, పౌలు తన గురించి వివరించుకున్న దానిని బట్టి (వృద్ధుడను… పౌలను నేను) మరియు తన పరిస్థితులను బట్టి (ఖైదీనైయున్న) ఫిలేమోను యొక్క సానుభూతిని కోరుకుంటున్నాడు.

  • పౌలు ప్రేమనుబట్టి వేడుకుంటున్నాడు కాబట్టి, ఫిలేమోను యొక్క ప్రేమ గల సానుభూతిని పొందుకోడానికి కావాల్సినవన్ని చేస్తున్నాడు. “ఫిలేమోను, నీ నుంచి నాకు ఏమి కావాలో చెప్పే ముందు, నేను వృద్ధుడను, మరియు ఖైదీని అని జ్ఞాపకముంచుకో.”
  • కొన్ని తర్జుమాలలో వృద్ధునికి బదులుగా దూత అని రాయబడింది. ఆ రెండు ప్రాచీన గ్రీకు పదాలలో ఒక్క అక్షరమే వేరుగా ఉంటుంది.

c. నా కుమారుడగు ఒనేసిము కోసరము నిన్ను వేడుకొనుచున్నాను: ఒనేసిము తన యజమానుడైన ఫిలేమోను నుంచి పారిపోయిన బానిస. ఒనేసిము తపించుకున్నప్పుడు, అతను రోమాకు పారిపోయి ఉద్దేశ్యపూర్వకంగానో కాదో గాని పౌలుని కలిసినట్టున్నాడు. పౌలు రోమీయుల చేత గృహ నిర్బంధంలో ఉన్నప్పటికీ, ఒనేసిమును యేసు క్రీస్తు నందలి విశ్వాసములోకి నడిపించాడు (నా బంధకములలో నేను కనిన నా కుమారుడు).

  • రోమా సామ్రాజ్యము యొక్క అతి పెద్ద పట్టణమైన రోమాకి ఒనేసిము పారిపోయాడనేది నమ్మదగిన విషయమే. లైట్ఫుట్ ఏమన్నాడంటే, “మానవత్వంతో ఉన్న చెత్త అంతటికి రోమా ఒక సహజమైన మురికినీటి అడ్డా”. అయితే తన యజమానుడైన ఫిలేమోనుని యేసు ప్రభువులోకి నడిపించిన పౌలును ఒనేసిము రోమాలో కలుసుకున్నాడు (ఫిలేమోను 1:19).
  • పౌలు ఒనేసిము బదులు వేడుకున్నప్పుడు, రోమా సాంప్రదాయాలను అనుసరించాడు. ఒక బానిస తన యజమాని నుండి పారిపోయినట్లైతే, అతడిని బలిపీఠం వద్ద పవిత్రమైన స్థలం వద్ద అనుమతించే ఒక ప్రాచీన గ్రీకు చట్టం (రోమీయులు కూడా దానిని అనుసరించారు) ఉంది. ఆ బలిపీఠము ఒక కుటుంబము యొక్క ఇంటిలోని పొయ్యి అయినా అవ్వొచ్చు. అప్పుడు ఆ ఇంటి యజమాని ఆ బానిసని తిరిగి తన యజమానుని వద్దకు పంపించేంత వరకు ఆ బానిసకి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ ఆ బానిస తిరస్కరిస్తే, ఆ ఇంటి యజమాని ఆ బానిసని వేలానికి పెట్టి వచ్చిన డబ్బును తన పాత యజమానికి ఇవ్వాల్సి ఉంటుంది. పౌలు ఒనేసిముకు రక్షణ కల్పించాడు, ఇప్పుడు ఫిలేమోనుతో కలిసి సమస్యను పరిష్కరిస్తున్నాడు.

d. నా కుమారుడగు ఒనేసిము: పౌలు తన ద్వారా మారుమనస్సు పొందిన వారిని తన “బిడ్డలుగా” సంబోధించాడు. తిమోతి (1 కొరింథీయులకు 4:17), తీతు (తీతుకు 1:3), కొరింథు క్రైస్తవులు (1 కొరింథీయులకు 4:14) మరియు గలతి క్రైస్తవులు (గలతీయాలకు 4:19), వీరంతా పౌలు ఇక్క “పిల్లలుగా” పిలువబడ్డారు.

e. అతడు మునుపు నీకు నిష్‌ప్రయోజనమైనవాడే గాని, యిప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైనవాడాయెను: ఎదో విధంగా ఒనేసిము పౌలుకు ప్రయోజనకరమైనవాడాయెను. బహుశా పౌలు నిర్బంధంలో ఉండగా, తనకు సహాయకునిగా ఒనేసిము సేవ చేసి యుండవచ్చు. అందుకే, ఫిలేమోను నుంచి పారిపోయిన బానిసైన ఒనేసిము తాను పారిపోయినందున ఇప్పుడు ఫిలేమోనుకు నిష్‌ప్రయోజనమైనవానిగా అయ్యాడు. అయితే అతను పౌలుకు ప్రయోజనకరమైనవాడాయెను – దానిని బట్టి ఫిలేమోనుకు కూడా (నీకును నాకును ప్రయోజనకరమైనవాడాయెను). ఫిలేమోను పౌలుని ప్రేమించాడు కాబట్టి, ఒకవేళ ఒనేసిము పౌలుకు సహాయం చేసినట్లయితే అతను ఫిలేమోనుకు కూడా సహాయం చేసినట్లే.

  • పౌలు ఒనేసిము గురించి నిష్‌ప్రయోజనమైనవానిగా మరియు ప్రయోజనమైనవానిగా మాట్లాడినప్పుడు, అతను పదాలతో ఆడుకున్నాడు. ఒనేసిము అనే పేరుకు అర్ధం ప్రయోజనమైనవాడు. ఇప్పుడు అతను క్రైస్తవుడు కాబట్టి, ఒనేసిము తన పేరుకు తగినట్లుగా జీవించవచ్చు.
  • “పనికిరాని వానిని క్రీస్తులో పనికివచ్చే వానిగా మార్చబడడం గురించి పౌలు చెబుతున్న విషయమును ప్రాముఖ్యంగా గమనించాలి.” (బార్క్లే)
  • ఫిలేమోనుకు ఇది స్పష్టంగా వివరిస్తూ, పౌలు ఈ పారిపోయిన బానిస యొక్క సేవలు వినియోగించుకుంటానని ఫిలేమోనుకు ఆజ్ఞాపించలేకపోయినప్పటికీ సౌమ్యముగా ఈ విషయాన్ని సూచిస్తున్నాడు.

2. (12-14) ఫిలేమోను ఒనేసిమును తిరిగి పౌలు వద్దకు మళ్ళి పంపిస్తాడనే ఆశతో అతన్ని వెనక్కి పంపాడు.

​నా ప్రాణము వంటివాడైన అతనిని నీయొద్దకు తిరిగి పంపియున్నాను. నేను సువార్తకొరకు బంధకములో ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు పరిచారము చేయు నిమిత్తము నాయొద్ద అతని నుంచుకొనవలెనని యుంటిని గాని ​నీ ఉపకారము బలవంతముచేతనైనట్టు కాక స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండవలెనని, నీ సమ్మతిలేక యేమియు చేయుటకు నాకిష్టములేదు.

a. నా ప్రాణము వంటివాడైన అతనిని నీయొద్దకు తిరిగి పంపియున్నాను: ఒనేసిము ఎదో తప్పు చేసి తన యజమాని నుండి పారిపోయాడు. దాన్ని సరిచేసుకునే సమయం, కాబట్టి పౌలు తిరిగి పంపించడానికి ఇష్టపడుతున్నాడు. అయినప్పటికీ ఫిలేమోను ఒనేసిము పట్ల శాంతముతో వ్యవహరించాలని పౌలు స్పష్టముగా కోరుకున్నాడు. రోమా చట్టం ప్రకారం బానిస యొక్క యజమానికే బానిస పైన పూర్ణ నియంత్రణ ఉంటుంది. పారిపోవడం కంటే ఇంకా చిన్నవాటికే సిలువ వేయడం అనేది అసాధారణ విషయమేమి కాదు.

  • ఒక బానిస ఒక ట్రే నిండా స్పటికంతో తయారు చేసిన తాగే పాత్రలను తీసుకొని వెళ్తూ ఒకదానిని కింద పడవేసి ఎలా పగులగొట్టాడో ఒక ప్రాచీన రచయిత వివరించాడు. ఆ యజమాని వెంటనే ఆ బానిసని లాంప్రేలతో నిండిన చేపల చెరువులో వేయాలని డిమాండ్ చేసాడు. అవి ఆ బానిసని ముక్కలుగా చీల్చాయి. “రోమా చట్టం.. తన బానిసని పైన యజమానుని అధికారానికి ఎలాంటి హద్దులు విధించలేదు. జీవితమా లేక మరణమా అనేది పూర్తిగా ఫిలేమోను పైన ఉంది, బానిసలు ఇంతకంటే చిన్న తప్పులకే తరచు శిక్షింపబడేవారు” (లైట్ఫుట్)
  • రోమా సామ్రాజ్యంలో ఎక్కువ సంఖ్యలో ఉన్న బానిసలను దృష్టిలో ఉంచుకొని, పారిపోయిన వారికి లేదా తిరుగుబాటు చేసినవారికి అలాంటి కఠినమైన శిక్ష అవసరమని భావించారు. దాదాపు ఆరు కోట్ల బానిసలు ఉన్న ఒక సామ్రాజ్యంలో, తరచు బానిస తిరుగుబాటు భయాలు ఉండేవి. కాబట్టి, పారిపోయిన వారికి వ్యతిరేకముగా ఉన్న చట్టాలు కఠినముగా ఉండేవి. దొరికిన తరువాత, ఆ పారిపోయిన బానిస సిలువ వేయబడేవాడు లేదా “ఎఫ్” అనే అక్షరాన్ని ఎర్రగా కాల్చిన ఇనుప దండముతో నుదుటి పైన కాల్చేవారు. ఎఫ్ అనగా పారిపోయిన అని అర్ధం.
  • దీనిని దృష్టిలో ఉంచుకొని, పౌలు యొక్క నా ప్రాణము వంటివాడైన అనే పద బంధాన్ని అర్ధం చేసుకోవచ్చు. “ఫిలేమోను, ఈ మనుష్యుడు నీకు తప్పు చేసాడని, శిక్ష పొందడానికి అర్హుడని నాకు తెలుసు. అయితే అతడిని నా ప్రాణము వంటివానిగా భావించి అతనికి దయను చూపించుము”

b. నేను సువార్తకొరకు బంధకములో ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు పరిచారము చేయు నిమిత్తము నాయొద్ద అతని నుంచుకొనవలెనని యుంటిని: స్పష్టముగా, ఒనేసిము ఉండాలని పౌలు కోరుకున్నాడు ఎందుకంటే అతను పెద్ద సహాయముగా ఉన్నాడు. పౌలు తన మనవిని మూడు రకాలుగా విన్నవించుకున్నాడు.

  • మొదటగా, ఒకవేళ ఒనేసిము ఉంటే, అతను పౌలును నీకు ప్రతిగా సేవించేవాడు. “ఫిలేమోను, ఒకవేళ ఒనేసిమును నాతో వదిలేస్తే, అది నువ్వు నాకు సేవ చేసినట్లే, ఎందుకంటే ఒనేసిము నీ యొక్క దాసుడు.”
  • రెండవదిగా, ఒకవేళ ఒనేసిము ఉంటే, అతను బంధకములో ఉన్న ఒక వ్యక్తికి సహాయము చేస్తాడు. “ఫిలేమోను, నీకు ఒనేసిము కొంత ఉపయోగపడతాడని నాకు తెలుసు, అయినప్పటికీ నేను బంధకములో ఉన్నాను, నాకు వీలైనంత సహాయం అవసరం.”
  • మూడవదిగా, ఒకవేళ ఒనేసిము ఉంటే అతను సువార్తకొరకు బంధకములో ఉన్న వ్యక్తికి సహాయం చేస్తాడు. “ఫిలేమోను, నేను బంధకములో ఇక్కడ ఎందుకు ఉన్నానో దయచేసి మరచిపోవద్దు. అది సువార్తకొరకు అనే విషయం గుర్తుంచుకో.”

c. నీ సమ్మతిలేక యేమియు చేయుటకు నాకిష్టములేదు: పౌలు తన విజ్ఞప్తిని బలంగా నైపుణ్యంగా చేసాడు. అదే సమయంలో, నిర్ణయమును నిజముగా ఫిలేమోనుకు వదిలిపెట్టాడు. అతను ప్రేమతో విజ్ఞప్తి చేసాడు, కాని ఫిలేమోను యొక్క హక్కులను కాలరాయలేదు.

d. నీ ఉపకారము బలవంతముచేతనైనట్టు కాక స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండవలెనని: పౌలు తన నిర్ణయమును ఫిలేమోను పైన ఎందుకు బలవంతం చేయలేదో ఇది వివరిస్తుంది. ఒకవేళ పౌలు ఆదేశిస్తే, అప్పుడు ఫిలేమోను యొక్క ఉపకారము స్వేచ్ఛాపూర్వకమైనదిగా కాక బలవంతముచేత వస్తుంది. ఇది వ్యవహారాన్నంతా అసహ్యకరంగా చేసి ఫిలేమోనుకు రావలసిన బహుమానాన్ని తనకు రాకుండా చేస్తుంది.

  • ముఖ్యంగా, పౌలు ప్రభువు ముందు సరైనది చేయడానికి ఫిలేమోనుకు స్వాతంత్య్రం ఇచ్చాడు, మరియు పౌలు యొక్క బలవంతము చేత కాక తను స్వతహాగా చేసే స్వాతంత్య్రమును ఇచ్చాడు.

3. (15-16) ఒనేసిము తప్పించుకోవడంలో దేవుని అద్భుతమైన కార్యమును పౌలు వివరించాడు.

​అతడికమీదట దాసుడుగా ఉండక దాసునికంటె ఎక్కువవాడుగాను, ప్రియ సహోదరుడుగాను, విశేషముగా నాకును, శరీరవిషయమును ప్రభువు విషయమును మరి విశేషముగా నీకును, ప్రియ సహోదరుడుగాను, నీయొద్ద ఎల్లప్పుడు ఉండుటకే కాబోలు అతడు కొద్దికాలము నిన్ను ఎడబాసి యుండెను.

a. కొద్దికాలము నిన్ను ఎడబాసి యుండెను: ఒనేసిము ఎడబాసినది నిజము, కాని పౌలు అతడిని వెనక్కి పంపించాడు. కొద్దికాలము నిన్ను ఎడబాసి యుండెను అనేది పారిపోయిన బానిస అంత చెడ్డదిగా అనిపించట్లేదు.

  • కొద్దికాలము నిన్ను ఎడబాసి యుండెను అని రాసి, పౌలు బానిస యొక్క పారిపోవడాన్ని సున్నితంగా చెప్పాడు.

b. నీయొద్ద ఎల్లప్పుడు ఉండుటకే కాబోలు అతడు కొద్దికాలము నిన్ను ఎడబాసి యుండెను: కొన్ని విధాలుగా ఒనేసిము పారిపోవడం అనేది కేవలము సమస్యనే. అది ఫిలేమోనుకు ఒక పనివాడిని మరియు సొత్తును కోల్పోయింది. అది ఒనేసిమును నేరస్థునిగా చేసి, మరణ శిక్షకు పాత్రునిగా చేసింది. అయితే వీటన్నింటిలో, పౌలు దేవుని యొక్క ఉద్దేశ్యాన్ని చూసాడు మరియు ఫిలేమోను కూడా ఆ ఉద్దేశ్యాన్ని చూడాలి అని పౌలు కోరుకుంటున్నాడు.

  • నీయొద్ద ఎల్లప్పుడు ఉండుటకే కాబోలు” అనే వాక్యం ప్రాముఖ్యమైనది. “ఫిలేమోను, దేవుడు తన రహస్య కార్యమును నాకు చూపించాడు, నేను చూసే ఆ కార్యమును నీవు కూడా అంగీకరించాలి” అని పౌలు ఫిలేమోనుకు చెప్పలేదు అనే విషయాన్ని ఇది చూపిస్తుంది. బదులుగా, నీయొద్ద ఎల్లప్పుడు ఉండుటకే కాబోలు అనేది “ఫిలేమోను, దేవుడు ఇక్కడ అసమానమైన విధాలుగా పని చేస్తున్నాడు. నేను చూసేది, నీకు కూడా చెప్పనివ్వు, అది నీకు కూడా అర్ధం అవుతుంది కాబోలు” అని పౌలు యొక్క హృదయం ఏ రీతిగా ఉందో వివరిస్తుంది.

c. నీయొద్ద ఎల్లప్పుడు ఉండుటకే: ఇది ఒనేసిము పారిపోవుటలో దేవుడు చేసే కార్యము యొక్క ఉద్దేశ్యమును పౌలు చూసిన ఒక అంశం. యజమానుడైన ఫిలేమోను ఒక బానిసను కోల్పోయాడు; కాని క్రైస్తవుడైన ఫిలేమోను ఒక సహోదరుని పొందుకున్నాడు, అది కూడా ఎల్లప్పుడు ఉండుటకే.

d. అతడికమీదట దాసుడుగా ఉండక దాసునికంటె ఎక్కువవాడుగాను, ప్రియ సహోదరుడుగాను… నీయొద్ద ఎల్లప్పుడు ఉండుటకే: పౌలు ఒనేసిమును ఫిలేమోనుకు “తిరిగి పరిచయం చేస్తున్నాడు”; దాసునిగా కాదు, కాని సహోదరునిగా. దాసులుగా కాక సహోదరులుగా ఉన్న బంధంలో, పౌలు “యజమాని-దాసుడు” అనే సంబంధం యొక్క బాధను పూర్తిగా నిర్మూలించి చట్టపరంగా దాస్యత్వమును రద్దు చేయుటకు పునాదిని వేసాడు. ఒక మనిషి అపరిచితుడైతే, అతడిని నేను దాసునిగా చేసుకొని ఉంటాను. కాని నా సహోదరుడు దాసునిగా ఎలా అవుతాడు?

  • యజమానునికి దాసునికి మధ్య భేదమును తొలగించడమనేది ఖచ్చితముగా విప్లవకరమైన అభివృద్ధి.

4. (17-19) పౌలు పునరుద్ధరణ గురించి ఫిలేమోనుకు వ్యక్తిగతంగా చేసిన వాగ్ధానం.

కాబట్టి నీవు నన్ను నీతో పాలివానిగా ఎంచినయెడల నన్ను చేర్చుకొన్నట్టు అతనిని చేర్చుకొనుము. అతడు నీకు ఏ నష్టమైనను కలుగజేసిన యెడలను, నీకు ఏమైన ఋణమున్న యెడలను, అది నా లెక్కలో చేర్చుము; పౌలను నేను నా స్వహస్తముతో ఈ మాట వ్రాయుచున్నాను అది నేనే తీర్తును. అయినను నీ ఆత్మవిషయములో నీవే నాకు ఋణపడియున్నావని నేను చెప్పనేల?

a. కాబట్టి నీవు నన్ను నీతో పాలివానిగా ఎంచినయెడల నన్ను చేర్చుకొన్నట్టు అతనిని చేర్చుకొనుము: మరలా, పౌలు ఒనేసిము వైపు నిలబడి, కరుణను అభ్యర్ధిస్తున్నాడు. “ఒక వేళ సువార్తలో నేను నీకు పాలివాడనైతే, నాతో ప్రవర్తించినట్లే ఒనేసిముతోను ప్రవర్తించుము.”

  • పౌలు యొక్క విజ్ఞప్తి శక్తివంతమైనది ఎందుకంటే అతను ఒక తప్పు చేసిన వాని వైపు నిలబడి ఆ దాసుని యొక్క యజమానితో, “ఈ వ్యక్తి నేరస్థుడు అని శిక్షకు అర్హుడని నాకు తెలుసు. అయినప్పటికీ ఈ దాసుడు నా స్నేహితుడు, కాబట్టి ఒకవేళ అతడిని శిక్షిస్తే నన్ను కూడా శిక్షించు. శిక్షను తీసుకోవడానికి నేను అతని పక్కనే నిలుచుంటాను” అని చెప్తున్నాడు. తండ్రియైన దేవుడు అయిన మన యజమానుని వద్ద యేసు ప్రభువు మన కోసం సరిగ్గా ఇదే చేస్తాడు.

b. అతడు నీకు ఏ నష్టమైనను కలుగజేసిన యెడలను, నీకు ఏమైన ఋణమున్న యెడలను, అది నా లెక్కలో చేర్చుము: స్పష్టంగా ఒనేసిము పారిపోయినప్పుడు ఫిలేమోను నుండి దొంగిలించాడు. అదే మరణశిక్ష నేరం. దొంగిలించబడిన దాని విలువ తన లెక్కలో “చేర్చుము” అని పౌలు అడిగాడు. “ఫిలేమోను, నా ఖాతాలో దానిని ఉంచుము”

c. పౌలను నేను నా స్వహస్తముతో ఈ మాట వ్రాయుచున్నాను అది నేనే తీర్తును: నేను నీకు రుణపడి ఉన్నాను అని తన స్వహస్తముతో రాసి ఫిలేమోనుకు ఇచ్చినంతగా పౌలు చాలా తీవ్రంగా ఉన్నాడు. పౌలు ఫిలేమోనుతో “ఒనేసిము యొక్క తప్పును నా లెక్కలో చేర్చుము” అని చెప్పినప్పుడు, యేసు ప్రభువు మన పాపములను తన లెక్కలో చేర్చుకున్నట్లుగా, పౌలు ఒనేసిము పట్ల సరిగ్గా అదే చేసాడు.

  • “ఇక్కడ పౌలు తనను తాను తగ్గించుకొని తానే ఒనేసిము అయినంతగా, ఫిలేమోనుకు తానే తప్పు చేసినంతగా, ఒనేసిము కొరకు తన యజమానుని శాయశక్తులా బ్రతిమిలాడుతున్నాడు. క్రీస్తు మన పక్షమున తండ్రి అయిన దేవుడిని బ్రతిమిలాడినంతగా, పౌలు ఒనేసిము పక్షమున ఫిలేమోనును బ్రతిమిలాడాడు. నా ఆలోచన ప్రకారం, మనమంతా ఆయన ఒనేసిములము.” (లూథర్)

d. అయినను నీ ఆత్మవిషయములో నీవే నాకు ఋణపడియున్నావని నేను చెప్పనేల?: అయితే “లెక్కలు” చూస్తే, పౌలు ఇంకొక విషయం కూడా ప్రస్తావించాడు. “ఫిలేమోను, నీవు చెల్లించవలసినది చాలా ఉన్నది, ఎందుకంటే నీ ఆత్మవిషయములో నీవే నాకు ఋణపడియున్నావు“. ఫిలేమోను యొక్క రక్షణ నిమిత్తం పౌలుకు చెల్లించవలసినది దృష్టిలో ఉంచుకుంటే పౌలు ఒనేసిము రుణమును చెల్లించగలడు!

5. (20-22) ఫిలేమోను యొక్క ప్రత్యుత్తరము బట్టి పౌలుకు ఉన్న ధైర్యం.

అవును సహోదరుడా, ప్రభువునందు నీ వలన నాకు ఆనందము కలుగనిమ్ము, క్రీస్తునందు నా హృదయమునకు విశ్రాంతి కలుగజేయుము. నేను చెప్పినదానికంటె నీవు ఎక్కువగా చేతువని యెరిగి నా మాట విందువని నమ్మి నీకు వ్రాయుచున్నాను. అంతేకాదు, నీ ప్రార్థనల మూలముగా నేను నీకు అనుగ్రహింపబడుదునని నిరీక్షించుచున్నాను గనుక నా నిమిత్తము బస సిద్ధము చేయుము.

a. ప్రభువునందు నీ వలన నాకు ఆనందము కలుగనిమ్ము: ఆనందము మాట ప్రకారము ఇది లాభము. “ఒనేసిము” అనే పేరుకు మూల పదం అయిన ఓనినేమి అనే ప్రాచీన గ్రీకు పదానికి నుండి తర్జుమా చేయబడింది. అంతగా సున్నితం కానటువంటి విన్నపమును చెప్పడానికి పౌలు పదాలను ఒనేసిము అనే పేరును తెలివిగా వాడాడు. “ప్రభువునందు నీ వలన తిరిగి నాతో ఒనేసిమును ఉండనిమ్ము.”

b. క్రీస్తునందు నా హృదయమునకు విశ్రాంతి కలుగజేయుము: ఈ పత్రికలో ఇంతక ముందు, ఫిలేమోను పరిశుద్ధుల హృదయములకు విశ్రాంతి కలుగజేసినవానిగా పౌలు చెప్పాడు (ఫిలేమోను 1:7). ఇప్పుడు, ఒనేసిమును పౌలుతో ఉండడానికి అనుమతించడం ద్వారా ఫిలేమోను ఏ విధంగా తన హృదయమును విశ్రాంతిపరచగలడో పౌలు ప్రత్యేకముగా చెప్తున్నాడు.

c. నేను చెప్పినదానికంటె నీవు ఎక్కువగా చేతువని యెరిగి: పౌలు యొక్క పత్రిక, పూర్తిగా విన్నపముతో నిండినదియు, పూర్తిగా నిరీక్షణతో నిండినది కూడా. ఫిలేమోను చెడ్డవాడో లేదా కఠినస్థుడో కాదు. తన క్రైస్తవ భాద్యతను పౌలు అడిగినదానికంటే ఎక్కువగా చేయునని ఆశించడానికి పౌలుకు అనేక కారణాలున్నాయి.

d. అంతేకాదు, … నా నిమిత్తము బస సిద్ధము చేయుము: పౌలుకు ఫిలేమోనుకు ఉన్న దగ్గరి సంబంధాన్ని ఇది చూపిస్తుంది. ఫిలేమోను యొక్క గృహంలో ఆతిథ్యం ఎప్పుడూ పౌలు కొరకు ఎదురు చూస్తుందని పౌలుకి తెలుసు.

e. నీ ప్రార్థనల మూలముగా నేను నీకు అనుగ్రహింపబడుదునని నిరీక్షించుచున్నాను: ఫిలేమోను ప్రార్ధించాలని పౌలు కోరుతున్నాడు, అయితే ఆ ప్రార్ధనలు కేవలం చెయ్యాలని మాత్రం కాదని పౌలుకి తెలుసు. ఫిలేమోను యొక్క ప్రార్థనల మూలముగా వారి తిరిగి కలిసి ఉంటారని పౌలు నమ్ముచున్నాడు.

C. ముగింపు.

1. (23-24) రోమాలో ఉన్న వారి ఇరువురి స్నేహితుల నుండి పౌలు ఫిలేమోనుకు వందనములు పంపిస్తున్నాడు.

క్రీస్తుయేసునందు నా తోడి ఖైదీయైన ఎపఫ్రా, నా జతపనివారైన మార్కు, అరిస్తార్కు, దేమా, లూకా వందనములు చెప్పుచున్నారు.

a. ఎపఫ్రా, నా జతపనివారైన మార్కు, అరిస్తార్కు, దేమా, లూకా: కొలొస్సయిలకు ముగింపులో కూడా వీరి పేర్లు ప్రస్తావించబడ్డాయి (కొలొస్సయులకు 4:10-17). రెండు పత్రికలు ఒకే ప్రాంతానికి వెళ్లాయని ఇది రుజువు చేస్తుంది. ఫిలేమోను కోలోషిలో నివసించాడు.

  • తోడి ఖైదీయైన: “అక్షరాలా, ‘యుద్ధము యొక్క ఖైదీ’ అని రూపకంగా వాడబడింది.” (ఓఎస్టెర్లి)

2. (25) పత్రికకు ముగింపు

మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ ఆత్మకు తోడై యుండును గాక. మేన్‌.

a. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ ఆత్మకు తోడై యుండును గాక: పౌలు ఫిలేమోను రాసిన పత్రికలో కొన్ని శాశ్వతమైన సూత్రాలను చూడవచ్చు.

  • పౌలు బానిస వ్యవస్థను పడగొట్టాలని ఎప్పుడూ పిలుపునివ్వలేదు, కానీ ఫిలేమోనుకు రాసిన పత్రికలో ఉన్న సూత్రాలు బానిసత్వమును నాశనం చేశాయి. మనుష్యులు మారినప్పుడే సమాజంలో గొప్ప మార్పులు వస్తాయి, ఒక హృదయం ఒకసారి. మన సమాజంలో, జాత్యహంకారం, ఇతరులను చిన్న చూపు చూడడం వంటివి చట్టాల ద్వారా నిర్మూలించబడవు; హృదయం లో మార్పు జరగాల్సిందే.
  • ఒనేసిము తన యజమానుని దగ్గరకు వెళ్ళవలసియున్నది. మనం ఏదైనా తప్పు చేసినప్పుడు, దానిని సరి చేయడానికి మనం సర్వ శక్తులా ప్రయత్నించాలి. క్రీస్తులో నూతన సృష్టిగా చేయబడి (2 కొరింథీయులకు 5:17) తప్పుని సరిచేయడంతోనే మన భాద్యత అంతమవ్వదు; తప్పుని సరిచేయడం కష్టమైనా పరిస్థితిలో కూడా అది మన బాధ్యతను పెంచుతుంది.
  • తన తప్పులకు నైతికంగా ఒనేసిము బాధ్యుడు. ఫిలేమోనుకు రాసిన పత్రిక మనము ప్రాథమికంగా ఆర్ధిక స్థాయి చేత నిర్దేశించబడలేదు అనేది వెల్లడిపరుస్తుంది. ధనవంతులమైనా, పేదవారమైనా, మనం దేవుని ఆత్మ చేత నడుపబడానాలి కానీ మన ఆర్ధిక స్థాయిని బట్టి కాదు.
  • కొత్త నిబంధనలో ఇంకా ఏ భాగము కూడా క్రైస్తవ ఆలోచన విధానం మరియు జీవన విధానం గురించి ఇంత స్పష్టంగా వెల్లడిపరచలేదు. ఇది పూర్తిగా పౌలు యొక్క లక్షణమైన, ప్రేమ, జ్ఞానం, హాస్యం, దయాళుత్వము, యుక్తి, వీటన్నిటి కంటే క్రైస్తవ మరియు మానవ పరిపక్వతను కలిపి ఇస్తుంది.

b. మేన్‌: “మన బైబిల్లో ఫిలేమోనుకు రాసిన పత్రిక ఎందుకు ఉంది” అనే ప్రశ్నను అడిగేలా ఈ పత్రిక యొగ్గి ముగింపు ఉంది. క్రీస్తు శకం 110లో, ఎఫెసు యొక్క బిషప్ పేరు ఒనేసిము, అతను ఈ మనిషే కావొచ్చు. పౌలు ఈ పత్రిక రాసినప్పుడు ఒకవేళ ఒనేసిము తన ఇరవైల్లో ఉండి ఉంటే, క్రీస్తు శకం 110నాటికి డెబ్భై సంవత్సరాల వయస్సులో ఉండి ఉండేవాడు. ఆ రోజుల్లో బిషప్ కి అది అంత అసమంజసమైన వయస్సు కాదు.

  • “ఎఫెసీయులకు ఇగ్నేషియస్ రాసిన పత్రికలో, ఒనేసిము తిమోతి తరువాత ఎఫెసు యొక్క సంఘ కాపరిగా ప్రస్తావించాడు. ట్రాజన్ చక్రవర్తిగా ఉన్నప్పుడు, రోమాలో రాళ్లతో కొట్టబడి చంపబడ్డాడు అని రోమా బలిదానం చెప్తుంది.” (ట్రాప్)
  • పౌలు యొక్క పత్రికలన్ని మొదటగా ఒక సమూహంగా సమకూర్చింది ఎఫెసు పట్టణంలోనే అని చెప్పడానికి కొన్ని చారిత్రక ఆధారాలున్నాయి. బహుశా ఒనేసిము ఆ పత్రికలన్ని సేకరించి తన స్వాతంత్య్రం యొక్క నిబంధనలతో కూడిన తన పత్రిక తప్పకుండా ఉండాలని జతపరచియుండవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *