A. వందనము మరియు పరిచయము.
1. (1) రచయిత మరియు పాఠకుడు
పెద్దనైన నేను సత్యమునుబట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి వ్రాయునది.
a. పెద్దనైన నేను: ఈ పత్రిక యొక్క రచయిత తనను తాను కేవలం ఒక పెద్దగా గుర్తించుకుంటున్నాడు. బహుశా, ఎవరు అనేది మొదటి పాఠకులకు తెలిసి ఉండవచ్చు, ఆ రోజుల్లో, క్రైస్తవులకు ఇది యోహాను సువార్త, మొదటి మరియు రెండవ యోహాను, మరియి ప్రకటన గ్రంధాలు రాసిన అపొస్తలుడైన యోహాను రాసినది అని అర్ధం అయ్యి ఉండవచ్చు.
- బహుశా రెండవ యోహానులో ఎందుకైతే తనను తన పాఠకులకు నేరుగా సూచించుకోలేదో, అదే కారణంతో ఇక్కడ కూడా సూచించుకోక పోయి ఉండవచ్చు – హింస యొక్క భయము వల్ల నేరుగా సూచించుకోవడం అనేది తెలివితక్కువతనం, ఇంకా చెప్పాలంటే అనవసరం.
b. ప్రియుడైన గాయునకు: ఈ గాయుకి కొత్త నిబంధనలో ప్రస్తావించబడిన ఈ పేరుకి సంబంధం ఉందో లేదో మనకు తెలియదు (అపొస్తలుల కార్యములు 19:29, అపొస్తలుల కార్యములు 20:4; 1 కొరింథీయులకు 1:15; రోమీయులకు 16:23).
- ఇది గుర్తు పట్టడం కష్టమైనది ఎందుకంటే గాయు అనేది రోమా సామ్రాజ్యంలో అతి సాధారణమైన పేరు.
2. (2-4) నమ్మకమైన గాయునకు ఆశీర్వాదము
ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోను వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్యప్రవర్తననుగూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించితిని. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుటకంటె నాకు ఎక్కువైన సంతోషము లేదు.
a. ప్రియుడా, … నీవు అన్ని విషయములలోను వర్ధిల్లుచు: వర్ధిల్లు అనే పదం యొక్క అర్ధం అక్షరాలా “మంచి ప్రయాణం కలుగులాగున”. రూపకంగా దాని అర్ధం గెలవడం లేదా వర్ధిల్లడం. “అన్ని విషయములు నీకు మేలుకరంగా ఉండాలని నేను ఆశిస్తున్నాను” అని చెప్పడం.
- వర్ధిల్లుచు మరియు సౌఖ్యముగా ఉండవలెనని అనే రెండు క్రియలు పత్రికలు రాసే వాడుక భాషకి చెందినవి. ఈ పదబంధం ఎంత సాధారణం అంటే, కొన్ని సార్లు మొదటి అక్షరాలకే కుదించబడేవి. ఆ మొదటి అక్షరాల నుండే రచయిత యొక్క ఉద్దేశ్యం ఏంటో ప్రతి ఒక్కరు తెలుసుకునేవారు.
b. నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోను వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను: గాయుకి తాను శుభాకాంక్షలు మరియు ఆశీర్వాదాలు పంపించడానికి యోహాను ఈ సాధారణమైన పదబంధాన్ని ఉపయోగించాడు. కొంతమంది దీనిని క్రైస్తవునికి శాశ్వతంగా సంపద ఉంటుందని మరియు పూర్ణమైన ఆరోగ్యం ఉంటుందని తప్పుగా తీసుకున్నారు.
- నిజమే, దేవునికి మన నుంచి ఉత్తమమైనది కావాలని, మన మంచి కొరకే దేవుడు చేస్తాడని మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి. చాలా సార్లు మనకి ప్రస్తుతం ఉన్న విశేష శ్రేయస్సు మరియు శారీరక ఆరోగ్యం దేవుడు మన కొరకు దాచిన ఆ మంచిలో భాగం – అయితే ఈ శ్రేయస్సు మరియు ఆరోగ్యం విశ్వాసులకు దేవుడు వాగ్ధానం చేసిన అంతిమ ప్రతిఫలం.
- ఇంకా, ఇప్పుడున్న సమయానికి, దేవుడు తన తెలివైన ప్రణాళిక ప్రకారం, భౌతిక శ్రేయస్సు మరియు శారీరక ఆరోగ్యం లోని లోటును నిత్యత్వంలో గొప్ప శ్రేయస్సుని ఆరోగ్యాన్ని ఎక్కువగా ఇవ్వడానికి వాడుకుంటాడు.
- అయినప్పటికీ, కొంత మంది పేదరికంలో మరియు రోగంలో ఎందుకు నివసిస్తారంటే, కేవలం వారు దేవుని నుండి శ్రేష్టమైన దానిని వెదికారు, దేవుని సూత్రాలను పాటించారు, విశ్వాసంలో నడువరు. అదే విధంగా, కొందరు దేవుని ఆశీర్వాద వాగ్ధానాలను సులభం, సౌకర్యం మరియు విలాసాలని శరీరాశలకు ఉపయోగించాలని అంటారు.
c. నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము: యోహాను మన ఆరోగ్య స్థితికి ఆత్మీయ స్థితికి మధ్య సారూప్యతను చూపిస్తున్నాడు. అనేక క్రైస్తవులు వారి శారీరక ఆరోగ్య స్థితి వారి ఆత్మీయ ఆరోగ్య స్థితిలాగా ఉంటే వారు నిరాశ కలిగిన అనారోగ్యంతో ఉంటారు.
d. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుటకంటె నాకు ఎక్కువైన సంతోషము లేదు: యోహానుకు గాయు పట్ల ఉన్న సద్భావన గాయు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాడనే విషయం నుండి వచ్చింది. తన పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని తెలుసుకోవడం కంటే యోహానును మారేది సంతోషపెట్టలేదు.
- గాయు సత్యమును అనుసరించి నడిచాడని యోహానుకు తెలుసు ఎందుకంటే సహోదరులు వచ్చి గాయులో ఉన్న సత్యప్రవర్తననుగూర్చి సాక్ష్యము చెప్పారు. తాను సత్యమును అనుసరించి నడిచినది ఇతరులు గమనించి, దాని గురించి మాట్లాడారు ఎందుకంటే అది వారు చూసారు.
e. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని: దీని అర్ధం సరియైన బోధతో జీవించడం కంటే మరి ఎక్కువ. సత్యమును అనుసరించి నడుచుకొనుట అంటే అర్ధం ఏంటి? సత్యములో నడవడం కాదు, లేదా వారు బోధలో సరిగా ఉన్నందున యోహాను అత్యానందము కలిగియున్నాడు కానీ వేరే విషయాల గురించి అంతగా పట్టించుకోలేదు అని కొంతమంది అనుకుంటారు. ఆయన సంతోషము మత సామ్రాదాయాల కంటే ఎక్కువైన విషయాల వలన ఉంది.
- సత్యమును అనుసరించి నడవడం అంటే నీవు నమ్మిన సత్యముతో స్థిరంగా నడవడం. నీవు పడిపోయావని నీవు నమ్మినట్లైతే, నీ పతనాన్ని బట్టి జాగ్రత్తగా నడవాలి. నీవు దేవుని బిడ్డవి అని నమ్మినట్లైతే, పరలోకపు బిడ్డగా నడవాలి. నీవు క్షమించబడ్డావు అని నమ్మినట్లైతే, క్షమాపణ పొందిన వ్యక్తిగా నడవాలి.
- సత్యమును అనుసరించి నడవడం అంటే ఎలాంటి దగా మరియు దాపరికాలు లేకుండా నిజమైన వాస్తవమైన మార్గంలో నడవడం.
B. మంచి మరియు చేదు ఉదాహరణల నుండి నేర్చుకోవడం.
1. (5-8) గాయు: ఒక మంచి ఉదాహరణ
ప్రియుడా, వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్నవారికి నీవు చేసినదెల్ల విశ్వాసికి తగినట్టుగా చేయుచున్నావు. వారు నీ ప్రేమనుగూర్చి సంఘము ఎదుట సాక్ష్యమిచ్చిరి. వారు అన్యజనులవలన ఏమియు తీసికొనక ఆయన నామము నిమిత్తము బయలు దేరిరి గనుక దేవునికి తగినట్టుగా నీవు వారిని సాగనంపిన యెడల నీకు యుక్తముగా ఉండును. మనము సత్యమునకు సహాయకులమవునట్టు అట్టివారికి ఉపకారముచేయ బద్ధులమై యున్నాము.
a. వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్నవారికి నీవు చేసినదెల్ల విశ్వాసికి తగినట్టుగా చేయుచున్నావు: తన ఆతిథ్యమును బట్టి గాయుని యోహాను ప్రశంసిస్తున్నాడు. ఇది మనకు అల్పమైనదిగా అనిపించవచ్చు, కాని దేవునికి కాదు. ఒకరినొకరు ప్రేమించుకోవాలి అనే అవసరమైన ఆజ్ఞ యొక్క ఆచరణాత్మక జీవితం. ఇది క్రియారూపం దాల్చిన ప్రేమ.
- ఇది గొప్ప అభినందన: నీవు చేసినదెల్ల విశ్వాసికి తగినట్టుగా చేయుచున్నావు. దేవుడు మనకు ఇచ్చిన ఏ పనైనా, మనం నమ్మకముగా చేయాలి. మనం ఆయనను ముఖాముఖిగా చూసినప్పుడు భళా, నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైనవాటిమీద నియమించెదను, నీ యజమానుని సంతోషములో పాలుపొందుము (మత్తయి 25:21) అనే మాటలు మనం వింటామని యేసు ప్రభువు చెప్పాడు. మంచి దాసుని గురించి, అతను నమ్మకమైన వానిగా చెప్పబడింది.
b. దేవునికి తగినట్టుగా నీవు వారిని సాగనంపిన యెడల: ఆ రోజుల్లో, సాధారణంగా క్రైస్తవ యాత్రికులు మరియు ప్రత్యేకంగా ఒక చోటు నుండి ఇంకొక చోటుకు వెళ్లే పరిచారకులు ఇతర క్రైస్తవుల ఆతిథ్యము పైనే ఎక్కువగా ఆధారపడేవారు. సత్యం కోసం పాటుపడే వారికి సహాయం చేసినప్పుడు, వారు సత్యమునకు సహాయకులు అవుతారు అని యోహానుకు తెలుసు.
- ఇలా సహాయం చేసే వారి బహుమానం ముందు వరుసలో ఉండి పరిచర్య చేసే వారికి సమానంగా ఉంటుంది. యుద్ధములో పోరాడినవారికి, సహాయం చేసినవారికి సమముగా దోపుడు సొమ్ము పంచిపెట్టబడిన విధానమును మనం 1 సమూయేలు 30:21-25లో చూడవచ్చు. సైనికులు ఎంత ప్రాముఖ్యమో వారికి సహాయం చేసే వారు కూడా అంతే ప్రాముఖ్యమని రాజైన దావీదు అర్ధం చేసుకున్నాడు, మరియు దేవుడు సైనికులకు వారికి సహాయం చేసేవారికి సరిగ్గా ఉదారంగా బహుమానమును ఇచ్చేవాడు.
- తన పిల్లలలో ఒకరికి గిన్నెడు చన్నీళ్ళు అందించినా, అది దేవుడు మరిచిపోక తగిన ఫలమును తీసుకొని వస్తాడని యేసు ప్రభువు వాగ్ధానం చేసాడు (మత్తయి 10:42)
- యోహాను గాయు యొక్క అభివృద్ధి గురించి ప్రార్ధిస్తున్నాడో అర్ధం అవుతుంది: తన వనరులను దైవ మార్గంలో ఉపయోగించి ఇతరులకు ఆశీర్వాదంగా ఉన్నాడు. ఒకవేళ దేవుడు అతడిని మరి ఎక్కువగా ఆశీర్వదిస్తే, ఇతరులు కూడా మరి ఎక్కువగా ఆశీర్వదించబడుతారు.
c. వారు అన్యజనులవలన ఏమియు తీసికొనక: ఆది సంఘం యొక్క ప్రాచీన లోకం అనేక మతాలకు చెందిన మిషనరీలు మరియు బోధకులతో నిండియుంది, మరియు వారు సామాన్య ప్రజల నుండి కానుకలు తీసుకొని ఒకరినొకరు సహాయం చేసుకునేవాళ్ళు. అయితే ఈ క్రైస్తవ మిషనరీలు అన్యజనులవలన ఏమియు తీసికొనకూడదని యోహాను చెబుతున్నాడు. సామాన్య ప్రజల నుండి నిధులను స్వీకరించే బదులు, వారు తోటి క్రైస్తవుల సహాయం కోరవచ్చు.
d. దేవునికి తగినట్టుగా: క్రైస్తవులు సహాయం చేయడానికి మాత్రమే కాదు గాని, దేవునికి తగినట్టుగా సహాయం చేయడానికి పిలువబడ్డారు. ఇతరులకు సహాయం చేయడానికి ఘనముగా మన పనిని చేయాలి.
- క్రైస్తవులు సువార్త వ్యాప్తి కొరకు ఏదైనా చేస్తూ ఉండేలా చూసుకోవాలి. తరువాత అది దేవునికి తగినట్టుగా చేసేలా చూసుకోవాలి. మత్తయి 28:19 లో చెప్పబడిన గొప్ప ఆజ్ఞలో మనమందరము పాలి భాగస్థులు కావలెనని దేవుడు మనలను పిలిచాడు. కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మ మిచ్చుచు. ఒకరు వెళ్లడం ద్వారానో లేదా సహాయ చేయడం ద్వారానో పాలి భాగస్థులు అవుతారు, కానీ ప్రతి ఒక్కరికి భాగం ఉంది మరియు దానిని బాగుగా చేయాలి.
- మిమ్మును చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును; నన్ను చేర్చుకొనువాడు నన్ను పంపినవాని చేర్చుకొనును. ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకొనువాడు ప్రవక్తఫలము పొందును; నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకొనువాడు నీతిమంతుని ఫలము పొందును (మత్తయి 10:40-41), అని యేసు ప్రభువు చెప్పాడు. మనం సువార్త బోధించే వారిని ఏ రీతిగా చేర్చుకోవాలో మరియు వారికి ఏ రీతిగా సహాయపడాలో అర్ధం చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది.
2. (9-11) దియొత్రెఫే: ఒక చెడ్డ ఉదాహరణ.
నేను సంఘమునకు ఒక సంగతి వ్రాసితిని. అయితే వారిలో ప్రధానత్వము కోరుచున్న దియొత్రెఫే మమ్మును అంగీకరించుటలేదు. వాడు మమ్మునుగూర్చి చెడ్డమాటలు వదరుచు, అది చాలనట్టుగా, సహోదరులను తానే చేర్చు కొనక, వారిని చేర్చుకొన మనస్సుగలవారిని కూడ ఆటంక పరచుచు సంఘములోనుండి వారిని వెలివేయుచున్నాడు; అందుచేత నేను వచ్చినప్పుడు వాడు చేయుచున్న క్రియ లను జ్ఞాపకము చేసికొందును. ప్రియుడా, చెడుకార్యమును కాక మంచికార్యము ననుసరించి నడుచుకొనుము. మేలుచేయువాడు దేవుని సంబంధి, కీడుచేయువాడు దేవుని చూచినవాడుకాడు.
a. అయితే.. దియొత్రెఫే: యోహాను బాహాటంగానే ఈ మనుష్యుని గద్దించాడు, మరియు తన పేరు పెట్టి గద్దించాడు. పేరు పెట్టి గద్దించడం ద్వారా ప్రేమ యొక్క అపొస్తలుడు ప్రేమను పక్కన పెట్టలేదు. అయితే, లేఖనాలలోని స్పష్టమైన ఆజ్ఞను (రోమీయులకు 16:17) మరియు ఇతర అపొస్తలుల ఉదాహరణను (2 తిమోతి 4:14-15) అతను అనుసరించాడు
చాలా బాగా వివరించారు.🙏🙏🙏