2 కొరింథీయాలకు 8:4 వారు తమ సామర్థ్యము కొలదియే గాక సామర్థ్యముకంటె ఎక్కువగాను తమంతట తామే యిచ్చిరని మీకు సాక్ష్యమిచ్చుచున్నాను.
2 కొరింథీయాలకు 9:13 ఏలాగనగా క్రీస్తుసువార్తను అంగీకరింతుమని ఒప్పుకొనుట యందు మీరు విధేయులైనందుచేతను, వారి విషయమును అందరి విషయమును ఇంత ఔదార్యముగా ధర్మము చేసి నందుచేతను, ఈ పరిచర్య మూలముగా మీ యోగ్యత కనబడినందున వారు దేవుని మహిమపరచుచున్నారు.
2 కొరింథీయులకు 5:16 కావున ఇకమీదట మేము శరీరరీతిగా ఎవనినైనను ఎరుగము; మేము క్రీస్తును శరీరరీతిగా ఎరిగియుండినను ఇకమీదట ఆయనను ఆలాగు ఎరుగము.
2 కొరింథీయులకు 5:17 కాగా ఎవడైనను క్రీస్తునందున్నయెడల వాడు నూతన సృష్టి; పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను;
2 తిమోతి 3:5 పైకి భక్తిగలవారివలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించనివారునై యుందురు. ఇట్టివారికి విముఖుడవై యుండుము.
2 తిమోతి 4:14-15 14అలెక్సంద్రు అను కంచరివాడు నాకు చాల కీడుచేసెను, అతని క్రియలచొప్పున ప్రభువతనికి ప్రతిఫలమిచ్చును; 15అతని విషయమై నీవును జాగ్రత్తగా ఉండుము, అతడు మా మాటలను బహుగా ఎదిరించెను.
2 తిమోతి 4:3-4 ఎందుకనగా జనులు హితబోధను సహింపక, దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అను కూలమైన బోధకులను తమకొరకు పోగుచేసికొని, సత్యమునకు చెవినియ్యక కల్పనాకథలవైపునకు తిరుగుకాలము వచ్చును.
2 రాజులు 2 1 యెహోవా సుడిగాలిచేత ఏలీయాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబోవు కాలమున ఏలీయాయు ఎలీ షాయు కూడి గిల్గాలునుండి వెళ్లుచుండగా 2 ఏలీయాయెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చి యున్నాడు గనుక నీవు దయచేసి యిక్కడ నుండుమని ఎలీషాతో అనెను. ఎలీషాయెహోవా జీవముతోడు, నీ…
అపొస్తలుల కార్యములు 1:14 వీరందరును, వీరితోకూడ కొందరు స్త్రీలును, యేసు తల్లియైన మరియయు ఆయన సహోదరులును ఏకమనస్సుతో ఎడ తెగక ప్రార్థన చేయుచుండిరి.
అపొస్తలుల కార్యములు 13:8 అయితే ఎలుమ ఆ అధిపతిని విశ్వాసమునుండి తొలగింపవలెనని యత్నముచేసి వారిని ఎదిరించెను; ఎలుమ అను పేరునకు గారడీవాడని అర్థము.