యూదా

A. యూదాని ఈ పత్రిక రాయడానికి ప్రేరేపించిన అపాయం.

1. (1) రచయిత మరియు పాఠకులు

యేసుక్రీస్తు దాసుడును, యాకోబు సహోదరుడునైన యూదా, తండ్రియైన దేవునియందు ప్రేమింపబడి, యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడినవారికి శుభమని చెప్పి వ్రాయునది.

a. యూదా: క్రొత్త నిబంధనలో “యూదా” అను పేరు గల వ్యక్తులు ఆరుగురు ఉన్నారు, అయితే మత్తయి సువార్త 13:55లో మరియు మార్కు సువార్త 6:3లో పేర్కొన్నట్లుగా యూదా, యేసు యొక్క సోదరునిగా గుర్తించబడడం అనేది ఉత్తమమైన ఆధారము.

యూదా, యేసు యొక్క ఇతర సోదరుల లాగా (యాకోబుతో సహా), యేసు పునరుత్థానుడయ్యే వరకు తానే మెస్సయ్య అని నమ్మలేదు (యోహాను 7:5 మరియు అపొస్తలుల కార్యములు 1:14)

b. యేసుక్రీస్తు దాసుడును: యూదా యేసుకు రక్త సంబంధికుడు, అయినా తనను యేసుక్రీస్తు దాసునిగానే ఎంచుకున్నాడు. “యూదా, యేసు యొక్క సోదరునిగా” కాక ఈ విధంగానే తెలుపబడాలనుకునే సత్యాన్ని బట్టి యూదా యొక్క తగ్గింపు మరియు మానవరీతిగా యేసుతో సంబంధం కలిగియుండడం యొక్క అల్పత్వాన్ని చెప్తుంది.

  • యేసు ప్రభువు ఈ మానవ సంబంధాల యొక్క అల్పత్వాన్ని మార్కు సువార్త 3:31-35 మరియు లూకా సువార్త 11:27-28లో చెప్పాడు
  • యేసు ప్రభువు తన సోదరుడు మరియు తనతో కలిసి ఒకే ఇంట్లో పెరిగాడు అనే సత్యానికి యూదా ఎంతో విలువనిచ్చాడు, అందులఓ ఎలాంటి సందేహం లేదు. అయితే యేసు క్రీస్తుతో తనకున్న కొత్త సంబంధం అంత కంటే విలువైనది. యూదాకి, తనని యేసుతో సంబంధం కలిగించిన తన శరీరంలో ప్రవహించే రక్తం కంటే తనను రక్షించిన సిలువ రక్తమే తనకు చాలా ప్రాముఖ్యం. యూదా పౌలుతో “మేము క్రీస్తును శరీరరీతిగా ఎరిగియుండినను ఇకమీదట ఆయనను ఆలాగు ఎరుగము.” అని చెప్పగలడు (2 కొరింథీయులకు 5:16).

c. యాకోబు సహోదరుడునైన: యెరూషలేములోని సంఘంలో యాకోబు ఒక ప్రాముఖ్యమైన నాయకుడు మరియు కొత్త నిబంధనలో తన పేరుతో ఉన్న పత్రిక రచయిత. యాకోబు మరియు యూదా ఇద్దరు యేసు ప్రభువు యొక్క సోదరులు.

d. పిలువబడినవారికి: యూదా క్రైస్తవులకు రాసాడు. ఇది సువార్త కరపత్రము కాదు. ఇది విశ్వాసులు వినాల్సిన విషయాలను గూర్చిన పత్రిక. అయితే చాలా సార్లు ఇవి వినాలి అని అనుకోరు.

  • వారు పిలువబడినవారు. దేవుడు ఒక వ్యక్తిని పిలిచినందునే తాను క్రైస్తవుడు. ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ పిలుపుకు స్పందించడం, సరిగ్గా మన మొబైల్ రింగ్ అయినప్పుడు మనం స్పందించినట్లు.
  • వారు తండ్రియైన దేవునియందు ప్రేమింపబడిన వారు. అంటే వారు ప్రత్యేకపరచబడినవారు – లోకానికి వేరుగా ప్రత్యేకపరచబడి దేవుని కొరకు ప్రత్యేకపరచబడినవారు
  • వారు యేసుక్రీస్తునందు భద్రము చేయబడిన వారు. యేసు క్రీస్తు మన సంరక్షకుడు మరియి మనల్ని కాపాడేవాడు

2. (2) యూదా సాదరంగా మరియు సాధారణంగా పలకరిస్తున్నాడు

మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించును గాక.

a. కనికరమును సమాధానమును ప్రేమయు: ఇది పౌలు యొక్క అనేక పత్రికల్లో కనబడే పలకరింపు కాదు (కొంచెం వేరుగా కృపయు సమాధానమును మీకు కలుగును గాక అని ప్రారంభం అవుతుంది). అయినప్పటికీ దాని అర్ధం అదే.

b. మీకు విస్తరించును గాక: ఒక క్రైస్తవుని జీవితంలో కనికరము సమాధానము ప్రేమ ఉండడం మాత్రమే కాదు కానీ అది విస్తరించాలని, యూదా తన మనసారా కోరుకుంటున్నాడు.

3. (3) విశ్వాసముకై పోరాడాలని పిలుపు

ప్రియులారా, మనకందరికి కలిగెడు రక్షణనుగూర్చి మీకు వ్రాయవలెనని విశేషాసక్తిగలవాడనై ప్రయత్నపడుచుండగా, పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెనని మిమ్మును వేడుకొనుచు మీకు వ్రాయవలసివచ్చెను.

a. మీకు వ్రాయవలెనని విశేషాసక్తిగలవాడనై: మనకందరికి కలిగెడు రక్షణనుగూర్చి రాయాలని యూదా యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఎదో జరిగినందున – యూదా వేరే పత్రిక వ్రాయవలసివచ్చింది. ఇలాంటి పత్రిక వ్రాయకూడనిది అని కూడా చెప్పవచ్చు.

  • యూదా పత్రిక అనేది ముఖ్యంగా ఒక ప్రసంగం. ఇందులో, యేసు క్రీస్తు యొక్క సువార్తను ప్రమాదంలో పడవేసిన అపాయకరమైన అనుసరణలు మరియు సిద్ధాంతాలకు వ్యతిరేకంగా యూదా బోధించాడు. ఇవి తీవ్రమైన సమస్యలు, యూదా వాటికి తీవ్రంగానే స్పందించాడు.
  • యూదా, పరిశుద్ధాత్మునికి సున్నితంగా ఉన్నందుకు మన సంతోషించాలి. ఒక క్రైస్తవ నాయకుడు ఒక సంఘానికి రాయాల్సిన ఒక పత్రిక బదులుగా పరిశుద్ధాత్ముని చేత ప్రేరేపించబడిన ఒక ప్రశస్తమైన సాధనంగా మరియు ఈ చివరి రోజుల్లో ఒక విలువైన హెచ్చరికగా మారింది.

b. మనకందరికి కలిగెడు రక్షణనుగూర్చి ప్రయత్నపడుచుండగా: మన రక్షణ అందరికి కలిగేది కాదు అంటే విలువ లేనిది కాదు. మనకందరికి కలిగే రక్షణ అంటే మనం ఒక సమాజంలో అందరం రక్షింపబడ్డాము. దేవునికి, ధనికులకు ఒకలాగా దరిద్రులకు వేరొకలాగా, లేదా మంచి వారికి ఒకలాగా చెడ్డవారికి వేరొకలాగా అనేది లేదు. మనమందరం దేవుని దగ్గరకు ఒకే లాగ వస్తాం. ఒకవేళ ఒకేవిధమైన రక్షణ కాకపోతే, అది దేవుని రక్షణ కాదు – అసలు అది రక్షణే కాదు.

  • ఒక వ్యక్తిగత క్రైస్తవునికి తెలియకపోవచ్చు, లేదా అర్ధం కాకపోవచ్చు, లేదా ఉపయోగం లేకపోవచ్చు, కానీ ఒక క్రైస్తవునిగా ఉండాలంటే ఒక సమాజంలో భాగంగా ఉండడమే. ఒక క్రైస్తవునిగా ఉండాలంటే ముందుగా వెళ్లిన కొన్ని లక్షల క్రైస్తవులతో కలిసి ఆనుకొని నిలబడడమే. మనం బలమైన క్రైస్తవులతోను మరియు బలహీన క్రైస్తవులతోను, ధైర్యముగల క్రైస్తవులతోను మరియు పిరికి క్రైస్తవులతోను, పెద్దలైన క్రైస్తవులతోను మరియు యవ్వనస్తులైన క్రైస్తవులతోను నిలబడతాం. కొన్ని తరాల నుంచి విస్తరించిన ఒక కనిపించని పరాక్రమవంతమైన సైన్యంలో మనము ఒక భాగం.
  • ” చాలా విషయాలలో విశ్వాసుల మధ్య వ్యత్యాసాలు ఉన్నాయి, అయితే హెబ్రోనుకు చెందినవారు అదే విధంగా బాప్టిస్టుకు చెందినవారును ఆనందించినదే, హోసన్నా సంఘానికి చెందినవారు అదే విధంగా పెంతెకొస్తుకు చెందినవారును కలిగియున్నదే, మెథడిస్టుకు చెందినవారు అదే విధంగా ఇండిపెండెంట్ కి చెందినవారును పొందినదే అందరికి కలిగే రక్షణ. వారికి తెలిసిన రక్త సంబంధికులందరి కంటే క్రీస్తులో ఉన్నవారే అతి దగ్గర వారు, మరియు ఈ లోతైన అవసరమైన సత్యంలో అత్యంత ఐకమత్యమే చాలా మంది ఊహించేకంటే అధికమైన శక్తి: కేవలం హద్దులు చెరిపేయండి అది అద్భుతాలు చేస్తుంది.”(స్పర్జియన్)
  • 1980ల్లో అమెరికా లో నిర్వహించిన ఒక సర్వే పోల్ లో, చర్చి కి వెళ్లే 70 శాతం మంది, చర్చికి వెళ్ళకుంటేనే మంచి క్రైస్తవునిగా ఉండవచ్చు అని చెప్పారు. ఇది మనకందరికి కలిగెడు రక్షణ అనే యూదా ఆలోచనకి భిన్నంగా ఉంది.

c. బోధ నిమిత్తము మీరు పోరాడవలెనని మిమ్మును వేడుకొనుచు: యూదా తాను రాయాలన్న పత్రికకు ఆటంకం కలిగించిన గొప్ప అవసరత ఇదే. పోరాటం అనేది కష్టమైన మరియు శ్రద్ధగల పని గురించి మాట్లాడుతుంది.

  • పోరాడవలెనని అనేది నిరంతర ప్రక్రియ, అది క్రైస్తవ పోరాటం నిరంతరం అనేది చూపిస్తుంది
  • మనం బోధ నిమిత్తం పోరాడుతూనే ఉంటాం ఎందుకంటే అది విలువైనది. మీరు ఒక ఆర్ట్ గ్యాలరీకి వెళ్ళినప్పుడు అక్కడ సెక్యూరిటీ గార్డ్ గాని లేదా సెక్యూరిటీ సిస్టం గాని లేకపోతే, అక్కడ అంతగా విలువైనవి లేవని దాని అర్ధం. విలువైనవాటికి రక్షణ అవసరం; విలువలేనివాటికి అవసరం లేదు.

d. బోధ నిమిత్తము మీరు పోరాడవలెనని మిమ్మును వేడుకొనుచు: ఒకవేళ మీరు అనే పదాన్ని నొక్కి చెప్పినట్లయితే, ఇది ప్రతి క్రైస్తవుడు చేయాలని యూదా చెప్పినట్లుగా మనం చూస్తాం. ప్రతి క్రైస్తవుడు బోధ నిమిత్తము అనేక విధాలుగా పోరాడగలడు.

  • మనం భయపడకుండా సాక్ష్యం చెప్పినప్పుడు, కరపత్రాలు పంచినప్పుడు, యేసు ప్రభువు కొరకు నమ్మకమైన రాయబారులను శిక్షణను సాధ్యపరచినప్పుడు, లేదా వారి పల్పిట్లో దేవుని వాక్యాన్ని మహిమపరచిన నమ్మకమైన సంఘ కాపరుల చేతులను బలపరచినప్పుడు, బోధ కొరకు మనం సానుకూలంగా పోరాడినట్లు.
  • అబద్ధ బోధకుల మద్దతు మరియు ప్రొత్సాహాన్ని తీసుకున్నప్పుడు మనం ప్రతికూలంగా పోరాడినట్లు.
  • మనం రాజీపడని జీవితాల్ని జీవించి మరియు మనలని మార్చిన ప్రభువుకు మహిమ చెల్లించినప్పుడు మనం ఆచరణాత్మకంగా బోధ కొరకు పోరాడినట్లు.
  • స్పష్టంగా, నమ్మకమైన మిషనరీలు మరియు సువార్తికులు బోధ నిమిత్తము పోరాడారు. అయితే లేఖనాలకు నమ్మకంగా ఉన్న సండే స్కూల్ టీచర్లు లేక గృహ నిర్వాహక నాయకులు కూడా అదే విధంగా పోరాడారు. ఇలాంటి క్రైస్తవులు కూడా ముందు వరసలో ఉన్న మిషనరీల వలె పోరాడారు. మనలో ప్రతి ఒక్కరు కూడా దేవుడు మనలని ఎక్కడ పెట్టినా సరే సువార్త నిమిత్తమై పోరాడాలి.

e. పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెను: ఇక్కడ, మనం దేని కొరకు పోరాడుతున్నామో యూదా చెప్తున్నాడు. ఈ లోకంలో చాలా గంభీరమైన పోరాటం ఉంది కానీ సాధారణంగా అది సరైన విషయాలకోసం కాదు. పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము పోరాడడంలో విలువ ఉంది.

  • బోధ అనేది మన వ్యక్తిగత నమ్మకం కాదు లేదా దేవునిలో మనకున్న నమ్మకాన్ని బట్టి విశ్వాసం కాదు. బోధ అంటే “నిజమైన క్రైస్తవులందరు కలిగిన సువార్తలోని అవసరమైన సత్యాలు”.
  • కొత్త నిబంధనలో ఈ భావంతో బోధ అనేది చాలా సార్లు వాడబడింది (అపొస్తలుల కార్యములు 6:7, 13:8, 14:22, 16:5, 24:24; రోమీయులకు 1:5, 16:26; కొలొస్సయులకు 2:7 మరియు 1 తిమోతికి 1:2 కేవలం కొన్ని ఉదాహరణలు). సత్యం కొరకు మనం తీవ్రంగా పోరాడాలి.
  • ఒక్కసారే అంటే బోధ ఒక్కసారే అప్పగింపబడింది, మళ్ళీ అప్పగింపబడాల్సిన అవసరం లేదు. ఆ సత్యాన్ని మళ్ళీ మళ్ళీ పంచిపెడతాం, అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే దేవుని చేత అపొస్తలులు మరియు ప్రవక్తల ద్వారా లోకానికి ఒక్కసారే అప్పగింపబడింది (ఎఫెసీయులకు 2:20). దేవుడు ఈ రోజు మాట్లాడవచ్చు కానీ కొత్త నిబంధనలో రాయబడినట్లుగా మొదటి అపొస్తలులు మరియు ప్రవక్తలతో అధికారపూర్వకంగా మాట్లాడినట్లుగా ఎన్నడూ మాట్లాడడు. “వేరే సువార్త అనేది లేదు, ఇక ఉండదు. సువార్తలోని విషయాలు పూర్తిగా అర్ధమౌతాయి, సువార్తలోని లోతులు అభివృద్ధి చెందుతాయి, సువార్తలోని అంచనాలు నెరవేరుతాయి; అయితే సువార్తకు ఎన్నటికీ అనుబంధం గాని ప్రత్యామ్నయం గాని ఉండదు” (ఎర్డ్మాన్)

4. (4) క్రైస్తవులలో కొందరు ప్రమాదకరమైన మనుష్యులు ఉన్నారు కాబట్టి మనము బోధకై పోరాడాలి

ఏలయనగా కొందరు రహస్యముగా జొరబడియున్నారు. వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు, మన అద్వితీయనాధుడును ప్రభువునైన యేసు క్రీస్తును విసర్జించుచున్నారు; ఈ తీర్పుపొందుటకు వారు పూర్వమందే సూచింపబడినవారు.

a. కొందరు రహస్యముగా జొరబడియున్నారు: వారు రహస్యముగా – ఇదే వారిని ప్రమాదకరంగా చేస్తుంది. వారు ప్రమాదకరమైన వారని ఎవరూ గుర్తించలేదు. “ప్రమాదం: అబద్ధ బోధకుడు” అనే పేరు గల టాగ్ ని వారు ధరించలేదు. ఈ కొందరు వేరే అందరి కంటే ఎక్కువగా బైబిల్ ఆధారంగా జీవించేవారని చెప్పుకొని ఉండవచ్చు

  • జొరబడి అంటే, “దొంగ ద్వారమున రహస్యముగా ప్రవేశించడం” (రాబర్ట్సన్) “సంఘం వెలుపల ఉన్న వెయ్యి దయ్యాలకంటే సంఘం లోపల ఉన్న ఒక్క దయ్యం చాలా నాశనం చేయగలదని అపవాదికి తెలుసు” (స్పర్జియన్)

b. ఈ తీర్పుపొందుటకు వారు పూర్వమందే సూచింపబడినవారు: ఈ కొందరికి ఒక తీర్పు ఉంది – ప్రతి అబద్ధ బోధకునికి మరియు నాయకునికి ఉండే తీర్పు. వారు తీర్పుపొందుటకు సూచింపబడినవారు, మరియు వారు భక్తిహీనులని సులువుగా చెప్పవచ్చు. వారు ఏ భావంలో భక్తిహీనులంటే, వారు దేవుని వంటి వారు కారు మరియు వారి పైకి ఎలా కనిపిపంచినా దేవుడిని నిర్లక్ష్యపరచే వారు.

  • వారు మనుష్యులకు రహస్యముగా ఉన్నారు కానీ దేవునికి కాదు. ఎవరైతే వారి బోధల ద్వారా మరియు జీవనశైలి ద్వారా ఇతరులను మోసపరుస్తున్నారో వారిని గూర్చి ప్రభువు పరలోకంలో చేతులు నలుపుకుంటూ చింతించట్లేదు. కొంతమంది విశ్వాసులకు అది మరుగైయుండవచ్చు కానీ దేవుడు వారిని తీర్పు తీర్చుటకు పూర్వమందే సూచించాడు. వారి తీర్పుపై ఒక నిశ్చయత ఉంది. సత్యం గెలుస్తుంది; మనం సత్యం వైపు ఉండడమే మన బాధ్యత.

c. వారు మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు: ఈ కొందరు దేవుని కృపను కొంత పొందుకున్నారు. అయితే వారు పొందుకున్న తరువాత, వారి కామాతురత్వమునకు సాకుగా కృపను వాడుకున్నారు

  • కామాతురత్వము అనే పదం వెనుక ఉన్న ఉద్దేశము ఏంటంటే, సిగ్గు లేకుండా, మనస్సాక్షి లేదా మర్యాద లేకుండా పాపాన్ని ఆచరించడం. సాధారణంగా లైంగిక అనైతికత పాపం లాంటి ఇంద్రియ పాపాలకు ఈ పదాన్ని వాడతాం. అయితే బైబిలుకు వ్యతిరేకంగా ఉన్న బోధకు, అనగా సత్యాన్ని తిరస్కరించి అబద్ధాలను సిగ్గు లేకుండా బోధించే సందర్భంలో కూడా దీనిని వాడవచ్చు. బహుశా యూదాకు ఈ రెండు మనస్సులో ఉండి ఉండవచ్చు, ఎందుకంటే పత్రిక మిగితా భాగంలో, ఈ కొందరికి నైతిక మరియు సిద్ధాంత సమస్యలు రెండు ఉన్నట్లుగా చూడవచ్చు.
  • యూదా యొక్క ఈ మాటలు కృపను ప్రకటించడంలో ఉన్న ప్రమాదాన్ని చూపిస్తున్నాయి. కొంతమంది దేవుని కృప అనే సత్యాన్ని తీసుకొని దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచే వారు ఉన్నారు. అయితే దీని అర్ధం దేవుని కృప సందేశంలో ఎదో తప్పు ఉందనో లేక ప్రమాదం ఉందనో కాదు. ఇది కేవలం మానవ హృదయం ఎంత అనైతికమైనదో చూపిస్తుంది.

d. మన అద్వితీయనాధుడును ప్రభువునైన యేసు క్రీస్తును విసర్జించుచున్నారు: ఈ కొందరు యేసు ప్రభువు తాను ఎవరైయున్నారో అని చెప్పిన దానిని గుర్తించకుండా తిరస్కరించినందున వారు ప్రభువునైన యేసు క్రీస్తును విసర్జించుచున్నారు. అందువలన వారు తండ్రియైన దేవుడిని కూడా విసర్జించుచున్నారు.

  • ఈ మనుష్యులు మన అద్వితీయనాధుడిని ఏ విధంగా విసర్జించుచున్నారో మనకు చెప్పబడలేదు. వారి భక్తిహీనతతోనో లేక వారి మతోన్మాద బోధలతోనో విసర్జించియుండవచ్చు. బహుశా రెండు నిజమైయుండవచ్చు.

B. కొందరు మనుష్యులకు వ్యతిరేకముగా దేవుని తీర్పు యొక్క నిశ్చయతకి మూడు ఉదాహరణలు.

1. (5) ఇశ్రాయేలు ప్రజల ఉదాహరణ.

ఈ సంగతులన్నియు మీరు ముందటనే యెరిగి యున్నను, నేను మీకు జ్ఞాపకము చేయగోరుచున్నదేమనగా, ప్రభువు ఐగుప్తులోనుండి ప్రజలను రక్షించినను, వారిలో నమ్మకపోయినవారిని తరువాత నాశనము చేసెను.

a. ఈ సంగతులన్నియు మీరు ముందటనే యెరిగి యున్నను, నేను మీకు జ్ఞాపకము చేయగోరుచున్నదేమనగా: తానేమి కొత్తవి చెప్పట్లేదని యూదాకి తెలుసు. అప్పటికే ఈ ఉదాహరణ వాళ్లకి బోధించబడింది, కానీ వారు మళ్ళీ దానిని విని వారి ప్రస్తుత స్థితికి అనువర్తించుకోవాలి.

  • నిజానికి, ప్రతి క్రైస్తవుడు ఈ పాత నిబంధన ప్రస్తావనలు చదివి “అవును యూదా, నీవు ఏమి మాట్లాడాలనుకున్తున్నావో నాకు ఖచ్చితంగా తెలుసు” అని చెప్పాలి. యూదా దేని గురించి రాశాడో మనకు తెలియకపోతే, బైబిల్ పట్ల మన అవగాహన లోతుగా ఉండాలని దాని అర్ధం.
  • “మూల వాస్తవాల ప్రకారంగా, ప్రామాణిక సిద్ధాంతాలు, లేఖనాల ప్రాధమిక సత్యాలు ప్రతి రోజు ధ్యానించాలి.’ప్రతి ఒక్కరికి తెలుసు’ అని మనం ఎప్పుడు చెప్పకూడదు; ఎందుకంటే, ప్రతి ఒక్కరు మరచిపోతారు.” (స్పర్జియన్)
  • “దేవుని వాక్యం మనకు తెలియని విషయాలను బోధించడానికి మాత్రమే కాదు గాని, ఆ జ్ఞానం మొద్దుబారిపోయి శ్రమపడకుండు నిమిత్తము, మనకు అర్ధం అయిన విషయాలను ధ్యానించడానికి పూనుకోవాలి.” (కాల్విన్)

b. ప్రభువు ఐగుప్తులోనుండి ప్రజలను రక్షించినను: సంఖ్యాకాండము 14 లో ఏమి జరిగిందో యూదా గుర్తు చేస్తున్నాడు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తులో దాస్యము నుండి విడిపించాడు. వారు ఐగుప్తును విడచి, ఎలాంటి అనుకోని ఆలస్యాలు లేకుండా వాగ్ధాన భూమికి చేరువైన కాదేషు బర్నేయ అనే స్థలానికి వచ్చారు. అయితే కాదేషు బర్నేయ వద్ద, ప్రజలు దేవుడిని నమ్మకుండా నిరాకరించి, వాగ్ధాన భూమి అయిన కానానుకు వెళ్ళలేదు. అందువలన ఐగుప్తును విడిచిన వారిలో పిల్లలు కాక దాదాపు పెద్దవారంతా వాగ్ధాన భూమికి ప్రవేశించలేకపోయారు.

  • ఈ పరిస్థితిలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఏమి చేసాడో, వారు దేవునికి ఎలా స్పందించారో ఆలోచించండి. ఎర్ర సముద్రము వద్ద దేవుని అద్భుతమైన విడుదలను అనుభవించారు. సీనాయి కొండా వద్ద దేవుని స్వరాన్ని విన్నారు. అరణ్యంలో రోజువారీ సంరక్షణను మరియు ఆహారముగా మన్నాను పొందుకున్నారు. అయినప్పటికీ, వారు అవిశ్వాసంలోకి జారిపోయి, ఆశీర్వాద స్థలానికి ఎన్నటికీ ప్రవేశించలేకపోయారు మరియు దేవుడు వారికి సిద్ధపరచినవి పొందుకోలేకపోయారు.

c. వారిలో నమ్మకపోయినవారిని తరువాత నాశనము చేసెను: కాదేషు బర్నేయ వద్ద దేవుడిని అనుమానించి తిరస్కరించిన వారు వాగ్ధా భూమికి ప్రవేశించలేకపోవడం మాత్రమే కాక పెద్ద వెలనే చెల్లించారు. వారు దేవుని తీర్పును పొందుకున్నారు. ప్రభువు వారికి ఎలా స్పందించాడో కీర్తనలు 95 వివరిస్తుంది: నలువది ఏండ్లకాలము ఆ తరమువారివలన నేను విసికి “వారు హృదయమున తప్పిపోవు ప్రజలు వారు నా మార్గములు తెలిసికొనలేదని అనుకొంటిని. కావున నేను కోపించి వీరెన్నడును నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణము చేసితిని”(కీర్తనలు 95:10-11).

  • యూదా ద్వారా వచ్చిన హెచ్చరిక స్పష్టముగా ఉంది. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి గొప్పగానే ప్రారంభించారు. దారిలో దేవుడి నుంచి అనేక ఆశీర్వాదాలు పొందుకున్నారు. అయితే వారు దేవుని వాగ్ధానము యొక్క శక్తిని మరియు కాపుదలను నమ్మకపోయినందున చివరి వరకు కొనసాగించలేకపోయారు.
  • ఈ ఉదాహరణ మనకు రెండు పాఠాలను నేర్పుతుంది. మొదటిది, దేవునితో వారి నడకను గొప్పగా ప్రారంభించినా సరే, ఇబ్బంది కలిగించే కొందరు మనుష్యులు తప్పకుండా తీర్పు తీర్చబడతారు అనే భరోసాను ఇస్తుంది. “కొందరు మనుష్యులు గొప్పగానే ప్రారంభించి ఉండవచ్చు, ఇశ్రాయేలు ప్రజల కూడా ఆ రీతిగానే చేశారు. అయితే దేవుడు వారిలో నమ్మకపోయినవారిని తరువాత నాశనము చేసెను.” అని యూదా చెప్తున్నాడు. రెండవది, నమ్మకపోయినవారి మధ్యలో ఎప్పుడూ ఉండకుండా యేసు ప్రభువును చివరి వరకు వెంబడించాలి అని మనకు హెచ్చరికను ఇస్తుంది. మన క్రైస్తవ్యానికి చివరి పరీక్ష, ఓర్పు. కొందరు పరుగు పందెమును ప్రారంభిస్తారు కానీ ఎప్పటికీ తుదముట్టించరు.

2. (6) పాపము చేసిన దేవదూతల ఉదాహరణ

మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక, తమ నివాసస్థలమును విడిచిన దేవదూతలను, మహాదినమున జరుగు తీర్పువరకు కటికచీకటిలో నిత్యపాశములతో ఆయన బంధించి భద్రము చేసెను.

a. తమ ప్రధానత్వమును నిలుపుకొనని దేవదూతలు: నిగూఢమైన వివాదాస్పదమైన విషయాలను తీసుకురావడంలో యూదా పత్రిక ప్రసిద్ధిచెందింది, అందులో ఇది ఒకటి. పాపము చేసి, బంధించబడి తీర్పు దినం కొరకు ఎదురు చూస్తున్న దేవదూత గురించి యూదా మాట్లాడుతున్నాడు.

  • “కొన్ని వచనాలలోనే అసాధారణమైన విషయాలను ముందు ఉంచడం, అనేక ఆసక్తికర ప్రశ్నలను లేవనెత్తడం కొత్త నిబంధనలో ఎక్కడా జరగలేదని చెప్పడం అతిశయోక్తి కాదు.” (సాల్మండ్, పల్పిట్ కామెంటరీ)

b. తమ ప్రధానత్వమును నిలుపుకొనని దేవదూతలు: ఈ ఫలానా దేవదూతలు ఎవరు అనే దాని పైన కొంత మేరకు వివాదం ఉంది. బైబిల్లో, దేవదూతల పాపం గురించి రెండు చోట్ల మాత్రమే రాయబడింది. మొదటిది, దేవునికి వ్యతిరేకముగా కొన్ని దేవదూతలు చేసిన మొదటి తిరుగుబాటు (యెషయా 14:12-14, ప్రకటన 12:4). రెండవది, ఆదికాండము 6:1-2లో వివరించబడిన దేవుని కుమారుల పాపము.

i. ఆదికాండము 6:1-2 ఒక వివాదాస్పదమైన భాగము. నరులు భూమిమీద విస్తరింప నారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కనివారని చూచి వారందరిలో తమకు మనస్సువచ్చిన స్త్రీలను వివాహము చేసికొనిరి అని ఉంటుంది. దేవుని కుమారులు దేవదూతలా లేక కేవలం మానవులలోనే “దేవుని వెంబడించేవారా” అని ప్రాముఖ్యమైన చర్చ జరుగుతుంది. అయితే యూదా ఈ ప్రశ్నకు జవాబును ఇవ్వడంలో సహాయపడ్డాడు.

c. తమ ప్రధానత్వమును నిలుపుకొనక, తమ నివాసస్థలమును విడిచిన: ఈ నేరం కొంత మట్టుకు లైంగిక పాపానికి సంబంధించినది, అనగా తిరుగుబాటు చేసిన దేవదూతలు (ఆదికాండము 6:2లో దేవుని కుమారులు) మరియు మానవులు (ఆదికాండము 6:2లో నరుల కుమార్తెలు) లైంగిక కలయిక. ఇందులో కొంచెం లైంగిక అంశం ఉందని మనకు తెలుసు, ఎందుకంటే తరువాత వచనంలో యూదా దానిని చెప్పాడు, యూదా 7: ఆ ప్రకారముగానే సొదొమ గొమొఱ్ఱాలును వాటి చుట్టుపట్లనున్న పట్టణములును వీరివలెనే వ్యభిచారము చేయుచు, పరశరీరానుసారులైనందున నిత్యాగ్నిదండన అనుభవించుచు దృష్టాంతముగా ఉంచబడెను. వీరివలెనే అనే పదం యూదా 6లో దేవదూతను సూచిస్తుంది. పరశరీరానుసారులైనందున అనే పదాలు అసహజమైన లైంగిక కలయికను సూచిస్తుంది.

  • ఆదికాండము 6 నుంచి ఈ అసహజమైన లైంగిక కలయిక గురించి కొన్ని విషయాలు మనకు తెలుసు. ఈ అసహజమైన లైంగిక కలయిక అసహజమైన సంతానాన్ని కలిగించింది. అసహజమైన లైంగిక కలయిక మనుష్యజాతిని మోసగించింది. కావున దేవుడు తన తరములో నిందారహితుడైన (ఆదికాండము 6:9) – అనగా “జన్యుపరంగా స్వచ్ఛమైన”, నోవాహును కనుగొనాల్సి వచ్చింది. ఈ సహజమైన కలయిక నమ్మశక్యం కాని తీవ్రమైన దేవుని తీర్పుకు దారి తీసింది – ఒక ప్రపంచ వరద, ఎనిమిది మంది మినహా తక్కిన మానవజాతిని తుడిచిపెట్టింది.
  • యూదా నుంచి మరొక విషయం తెలుసుకోవచ్చు. ఈ అసహజ కలయిక, ఈ విధంగా పాపం చేసిన దూతలను దేవుడు ప్రత్యేకముగా బంధించే లాగ చేసింది. వారు మహాదినమున జరుగు తీర్పువరకు కటికచీకటిలో నిత్యపాశములతో బంధించి భద్రముచేయబడినారు.
  • ఈ అసహజ కలయిక గురించిన ఇంత స్పష్టమైన వివరణ ఉన్నప్పుడు, ఊహించడం అనవసరం. మనకు “పడిపోయిన దేవదూతల” జన్యు కణాలు మానవ జన్యు కణాలతో ఎలా కలుస్తాయి మనకు తెలియదు. బహుశా పడిపోయిన దేవదూతలు మానవ శరీరంలో చేరి చేసి ఉండవచ్చు. దేవదూతలకు తాత్కాలికంగా మానవునిగా అగుపడగలదని మనకు తెలుసు, కానీ అంతకు మించి మనకు తెలియదు.

d. మహాదినమున జరుగు తీర్పువరకు కటికచీకటిలో నిత్యపాశములతో ఆయన బంధించి భద్రము చేసెను: దేవుడు ఈ దుష్ట దేవదూతలను నిత్యపాశములతో బంధించడం ద్వారా తీర్పు తీర్చాడు. స్పష్టంగా పడిపోయిన దేవదూతలలో కొందరు నిర్బంధించబడి ఉన్నారు, అయితే తక్కిన వారు మానవజాతి మధ్యలో దయ్యములుగా తిరుగుతున్నారు.

  • తమ ప్రధాన స్థలమును నిలుపుకొనక, ఇప్పుడు పాశములలో పెట్టబడియున్నారు. స్వాతంత్య్రం కొరకు వారి పాప ముసుగు వారిని దాస్యంలో పెట్టింది. అదే విధంగా, స్వాతంత్య్రం కొరకు పట్టు బట్టి వారికి ఇష్టం వచ్చినట్లు చేసే వాళ్ళు ఈ దూతల వలె – నిత్యపాశములతో బంధించబడుతారు. నిజమైన స్వాతంత్య్రం విధేయత ద్వారా వస్తుంది.
  • ఒకవేళ పాపము వారికి తెచ్చిపెట్టిన పాశములను, దేవదూతలే తెంచుకోలేకపోతే, మానవులమైన మనము తెంచుకోగలము అని అనుకోవడం వెర్రితనం. ఈ పాశముల నుండి మనంతట మనమే విడిపించుకోలేము గాని, యేసు ప్రభువు ద్వారా మాత్రమే విడిపించబడగలం.
  • అసహజమైన కలయికతో పాపము చేసిన దేవదూతలు ఇప్పుడు లేరని మనకు గుర్తు చేస్తుంది. నోవాహు దినములలోనే, తన గొప్ప తీర్పుతో అలాంటి అసహజమైన కలయికను దేవుడు అంతమొందించాడు.
  • ఈ ఉదాహరణ రెండు పాఠాలను నేర్పిస్తుంది. మొదటిది, వారి యొక్క ఆత్మీయ స్థితి ఏదైనప్పటికీ, ఆటంకపరిచే కొందరు మనుష్యులు తప్పక తీర్పు పొందుతారు. ఈ దేవదూతలు ఒకప్పుడు దేవుని యొక్క మహిమగల సన్నిధిలో ఉన్నారు. అయితే ఇప్పుడు వారు నిత్యపాశములతో ఉన్నారు. పాపము చేసిన దేవదూతలను దేవుడు తీర్పు తీరిస్తే, ఈ కొందరు మనుష్యులను కూడా ఆయన తీర్పు తీరుస్తాడు. రెండవది, మనము కూడా యేసు ప్రభువుతో మన నడకను కొనసాగించాలని మనలను హెచ్చరిస్తుంది. దేవదూతల పూర్వ ఆత్మీయ అనుభవం, వారి భవిష్యత్తు ఆత్మీయ స్థితికి హామీ ఇవ్వలేకపోతే, మన పరిస్థితి కూడా అంతే. మనము కాచుకొని మన నడకను కొనసాగించాలి.

3. (7) సొదొమ గొమొఱ్ఱాల ఉదాహరణ

ఆ ప్రకారముగానే సొదొమ గొమొఱ్ఱాలును వాటి చుట్టుపట్లనున్న పట్టణములును వీరివలెనే వ్యభిచారము చేయుచు, పరశరీరానుసారులైనందున నిత్యాగ్నిదండన అనుభవించుచు దృష్టాంతముగా ఉంచబడెను.

a. వీరివలెనే: సొదొమ గొమొఱ్ఱాలు (వాటి చుట్టుపట్లనున్న పట్టణములును) కూడా దేవుని తీర్పుకు ఉదాహరణగా ఉన్నవి. వారి పాపము – ప్రస్ఫుటంగా స్వలింగసంపర్కం, అయితే వేరే పాపములు కూడా చేశారు. అవి వారిపైకి దేవుని తీర్పును తీసుకొనివచ్చాయి.

  • సొదొమ గొమొఱ్ఱాలు ఆశీర్వదింపబడిన, విశేషమైన ప్రదేశాలు. అవి ఆశీర్వాదకరమైన ప్రాంతంలో ఉన్నాయి. యెహోవా తోటవలెను… నీళ్లు పారు దేశమైయుండెను (ఆదికాండము 13:10).

b. వ్యభిచారము చేయుచు, పరశరీరాను సారులైనందున: ఆదికాండము 19లో వివరించబడిన సొదొమ మనుష్యుల ప్రవర్తనను యూదా సూచిస్తున్నాడు. సొదొమ పాపములను యెహెఙ్కేలు 16:49 చూపిస్తుంది: నీ చెల్లెలైన సొదొమ చేసిన దోషమేదనగా, దానికిని దాని కుమార్తెల కును కలిగిన గర్వమును ఆహార సమృద్ధియు నిర్విచారమైన సుఖస్థితియు ననునదియే; అది దీనులకును దరిద్రులకును సహాయము చేయకుండెను. వ్యభిచారము ఒక్కటే వారు చేసిన పాపము కాదు గాని, వారు చేసిన పాపములలో ఇది ఖచ్చితంగా ఉంది, యూదా దీన్ని స్పష్టం చేస్తున్నాడు.

  • యెహెఙ్కేలు 16:49లో వివరించబడిన పాపములు సొదొమ గొమొఱ్ఱాలు సంపన్నమైన ఆశిర్వదించబడిన ప్రాంతాలుగా చూపిస్తుంది. భౌతిక ఆశీర్వాదాలు పొందకపోతే సంపూర్ణ ఆహారము, సమృద్ధి ఉండవు. అయితే దేవుడి నుంచి వారు భౌతికమైన ఆశీర్వాదాలు పొందుకున్నప్పటికీ, వారు పాపము చేసి తీర్పును పొందుకున్నారు.

c. నిత్యాగ్నిదండన అనుభవించుచు: ఆదికాండము 19లో, సొదొమ గొమొఱ్ఱాలు ఆకాశమునుండి వచ్చిన అగ్ని చేత నాశనమయ్యాయి. అయితే అగ్ని చేత వారికి వచ్చిన తీర్పే అంతం కాదు. ఆదికాండము 19లో జరిగినదానికంటే వారు నిత్యాగ్నిదండన అనుభవించారు.

  • ఈ ఉదాహరణ రెండు పాఠాలను నేర్పుతుంది. మొదటిది, వారు గతంలో ఎంతగా ఆశీర్వదించబడినప్పటికీ, ఆటంకపరిచే కొందరు మనుష్యులు తప్పక తీర్పు పొందుతారు. రెండవది, మనము కూడా యేసు ప్రభువుతో మన నడకను కొనసాగించాలని మనలను హెచ్చరిస్తుంది. గతంలో పొందుకున్న ఆశీర్వాదాలు, వారి భవిష్యత్తు ఆత్మీయ స్థితికి హామీ ఇవ్వలేకపోతే, మన పరిస్థితి కూడా అంతే.

C. కొందరు మనుష్యుల యొక్క అనేక పాపములు.

1. (8) ఈ ప్రమాదకరమైన కొందరు మనుష్యుల స్వభావం.

అటువలెనే వీరును కలలు కనుచు, శరీరమును అపవిత్రపరచుకొనుచు, ప్రభుత్వమును నిరాకరించుచు, మహాత్ములను దూషించుచు ఉన్నారు.

a. అటువలెనే: యూదా ఆ కొందరు మనుష్యులను, వారి వ్యభిచారమును బట్టి (శరీరమును అపవిత్రపరచుకొనుచు) మరియు దేవుని అధికారమును వారు నిరాకరించిన విధానమును బట్టి (ప్రభుత్వమును నిరాకరించుచు) సొదొమ గొమొఱ్ఱాల ప్రజలతో కలిపాడు.

  • ఈ కొందరు మనుష్యులు ప్రభుత్వమును నిరాకరించారు అని యూదా ఎత్తి చూపినప్పుడు, వారు అధికారం కోరుకున్నారని దాని అర్ధం. కాబట్టి వారు దేవుని అధికారమును నిరాకరించి, దేవుడు నియమించిన వారిని నిరాకరించారు.
  • ఈ రోజు మన సంస్కృతి, ప్రభుత్వమును నిరాకరించి మన జీవితాల్లో మనమే నిజమైన అధికారి అని ప్రోత్సహిస్తుంది. కొన్ని వాక్య భాగాలనే నమ్మి, మనం బైబిల్ ద్వారా కూడా ఇది చేయవచ్చు. మనకు కావలసినవి ఏరుకొని, మన నమ్మకాలతో కూడా మనం ఇది చేయవచ్చు. లేదా మన జీవన శైలి ద్వారా మన స్వంత నియమాలతో దేవుడు స్థిరపరచి సరియైన అధికారాన్ని గుర్తించకుండా కూడా ఇది చేయవచ్చు.
  • ఇశ్రాయేలు యొక్క చీకటి దినాలలో, సమాజము ఒక పదంతో వర్ణించబడింది: ప్రతి వాడును తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచువచ్చెను (న్యాయాధిపతులు 21:25). ఈ రోజు, ప్రపంచమంతా, ముఖ్యంగా పాశ్చాత్య నాగరికత ఈ ధోరణిలో వెళ్తుంది.

b. వీరును కలలు కనుచు: కొందరు మనుష్యులు వాస్తవానికి దూరంగా ఉన్నారని యూదా ఉద్దేశ్యం అయ్యి ఉండవచ్చు. వాటిని పరలోక దర్శనాలుగా చెప్పుకుంటూ నిజముగా మోసపరచుచున్నారని ఆయన అర్ధం.

c. మహాత్ములను దూషించుచు: బహుశా ఈ మహాత్ములు, అపొస్తలులును లేదా సంఘంలో ఉన్న ఇతర నాయకులును అయ్యి ఉండవచ్చు. ప్రభుత్వమును నిరాకరించడం అనేది మహాత్ములను దూషించడంతో ముడిపడియుంది.

2. (9) మహాత్ములను దూషించకూడదు అనే దానికి ప్రధానదూతయైన మిఖాయేలు ఉదాహరణ

అయితే ప్రధానదూతయైన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషేయొక్క శరీరమునుగూర్చి తర్కించినప్పుడు, దూషించి తీర్పుతీర్చ తెగింపక ప్రభువు నిన్ను గద్దించును గాక అనెను.

a. ప్రధానదూతయైన మిఖాయేలు అపవాదితో: యూదా రెండు రకాల దేవదూతలను ప్రస్తావించాడు. మిఖాయేలు దేవునికి నమ్మకముగా ఉన్న దూతలలో ఉన్నాడు, వారే దేవుని సేవకులును మరియు మనుష్యులకు సేవ చేసే వారును. అపవాది దేవునికి తిరుగుబాటు చేసిన దేవదూతలలో ఉన్నాడు, వారే మనుష్య విరోధులు.

  • మన చుట్టూ కనిపించని దేవదూతలు ఉన్నారు. మనకు పరిచర్య చేయుటకు దేవుడు పంపించిన ఆత్మలను, మరియు మనలను ఓడించాలనుకునే దురాత్మలును ఉన్నాయి. అపవాది రక్షింపబడిన ఒక వ్యక్తిని రక్షింపబడకుండా చేయలేదు; అయితే వాని మోసాల ద్వారా స్వచ్ఛంగా స్వేచ్ఛగా నడువవల్సిన ఒక క్రైస్తవుని అపవిత్రపరచగలడు. అపవాదికి మనం తన పనిని ధ్వంసం చేసే టైం బాంబ్ లాంటి వాళ్ళం – ఆ బాంబులను నీరు గార్చి అవి పేలకుండా చేయడానికి ప్రయత్నిస్తుంటాడు.

b. ప్రధానదూతయైన మిఖాయేలు: బైబిల్ లో నాలుగు అధ్యాయాలలో ఈ దేవదూత గురించి ప్రస్తావించారు: దానియేలు 10, దానియేలు 12, ప్రకటన 12 మరియు ఇక్కడ. మిఖాయేలు కనిపించిన ప్రతీసారి, యుద్ధము లేదా పోరాడటంపై సిద్ధపాటు అనే సందర్భంలో ఉంది. ఆయన ప్రధానదూత, అనగా “దూతలను నడిపించే నాయకుడు”

  • ఒకవేళ అపవాదికి ఎదురుగా ఎవరైనా ఉన్నారంటే, అది ఖచ్చితంగా దేవుడు కాదు. ప్రధానదూతయైన మిఖాయేలే – ఉన్నత స్థాయిలో ఉన్న వేరొక దేవదూత.
  • “పరిశుద్ధ లేఖనాల్లో, ప్రధానదూతలు అని ఎక్కడా రాయబడలేదు అనేది గమనించాలి. సరిగ్గా ఒక్క ప్రధాన దూత మాత్రమే లేదా దేవదూతలందరికి ఒక్క నాయకుడు మాత్రమే ఉంటారు. మానవజాతికి గొప్ప శత్రువైన అపవాది అనే పదం కూడా బహువచనంలో ఉండదు; అయితే పడిపోయిన దూతలందరికి ఒక్క చక్రవర్తి మాత్రమే ఉంటాడు.” (క్లార్క్)

c. మోషేయొక్క శరీరమునుగూర్చి తర్కించినప్పుడు: యూదా సూచించిన మరొక నిగూఢమైన విషయం. మోషేయొక్క శరీరము గురించి మనం చివరగా చదివేది ద్వితీయోపదేశకాండము 34:5-6లో: యెహోవా సేవకుడైన మోషే యెహోవా మాటచొప్పున మోయాబు దేశములో మృతినొందెను. ​బెత్పయోరు యెదుట మోయాబు దేశము లోనున్న లోయలో అతడు పాతిపెట్టబడెను. అతని సమాధి యెక్కడనున్నదో నేటివరకు ఎవరికి తెలియదు.

  • ఈ వివాదం గురించిన సమాచారం యూదా ఎక్కడ పొందుకున్నాడో తెలియదు. దేవుని నుంచి ప్రత్యేకంగా బహిర్గతం అయ్యి ఉండవచ్చు. అయితే ఆది సంఘంలో ఉన్న బోధకుల ప్రకారం, కొన్ని భాగాలు మాత్రమే కలిగియున్న అస్సమ్పషన్ అఫ్ మోసెస్ అనే అప్రసిద్ధమైన పుస్తకాన్ని యూదా సూచించాడు.
  • మోషేయొక్క శరీరమునుగూర్చి ఎందుకు వివాదం ఉందో కూడా మనకు తెలియదు. దారి తప్పిన ఇశ్రాయేలీయులను విగ్రహారాధనలోకి నడపడానికి, అపవాది మోషే యొక్క శరీరాన్ని ఒక ఆరాధన వస్తువుగా వాడాలని అనుకుంది అని కొందరు అంటారు. మోషే ఐగుప్తీయుని హతమార్చినందుకు, మోషే యొక్క శరీరాన్ని అపవిత్రపరచి స్వాధీనపరచుకోవాలని అనుకుంది అని మరి కొందరు అంటారు.
  • మోషే శరీరముపై దేవునికి ఉన్న ఉద్దేశ్యాన్ని అపవాది ముందే పసిగట్టి, ఆ ప్రణాళికను ఓడించాలని ప్రయత్నించి ఉండవచ్చు. మోషే మరణము తరువాత, ఏలీయాతో (2 రాజులు 2లో ఏలీయా శరీరము పరలోకానికి కొనిపోబడింది) కలిసి వారి శరీరాలతో రూపాంతరము వద్ద (మత్తయి 17:1-3) కనిపించారని మనకు తెలుసు. బహుశా ప్రకటన 11లోని ఇద్దరు సాక్ష్యులు మోషే మరియు ఏలీయా కావొచ్చు, మరియు దేవునికి ఆ భవిష్య ప్రణాళిక కోసం మోషే యొక్క శరీరం అవసరం అయ్యి ఉండవచ్చు.
  • అయితే, మిఖాయేలు ఎందుకు తర్కించాడనేది కాదు గాని ఎలా అపవాదితో తర్కించాడనేదే యూదా యొక్క ముఖ్య అంశం.

d. దూషించి తీర్పుతీర్చ తెగింపక ప్రభువు నిన్ను గద్దించును గాక అనెను:

మిఖాయేలు పోరాడిన పద్ధతి ఆత్మీయ పోరాటానికి ఒక మాదిరిగా ఉంది. మొదటిది, మిఖాయేలు యుద్ధంలో ఉన్నట్లుగా మనం చూస్తాము. రెండవది, ప్రభువు యొక్క అధికారంలో తాను పోరాడాడు.

  • కొన్ని మతోన్మాద గుంపులు అనుకున్నట్లుగా, మిఖాయేలు యేసు ప్రభువు కాదనే విషయాన్ని ఇది రుజువు పరుస్తుంది. యేసు ప్రభువు తన అధికారంతో అపవాదిని గద్దించాడు, కానీ మిఖాయేలు అలా చేయలేదు. “గమనించదగిన బేధమేంటంటే మిఖాయేలు తన స్వంత అధికారంతో అపవాది ఆరోపణను గద్దించలేకపోయాడు” (బాఖం)
  • ప్రాముఖ్యంగా, మిఖాయేలు దూషించి తీర్పుతీర్చ తెగింపలేదు. మిఖాయేలు అపవాదిని హేళన చేయలేదు, నిందించలేదు. అపవాదిని తీర్పు తీర్చడానికి, లేదా గద్దించడానికి, లేదా హేళన చేయడానికి, లేదా నిందించడానికి దేవుడు మనలను పిలవలేదు కాని ప్రభువు నామంలో అతనితో పోరాడడానికి పిలిచాడు.
  • మిఖాయేలే దూషించి తీర్పుతీర్చ తెగింపనప్పుడు కొందరు మనుష్యులు మహాత్ములను దూషించకుండా ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి.

3. (10) కొందరు మనుష్యుల చెడు స్వభావం

వీరైతే తాము గ్రహింపని విషయములనుగూర్చి దూషించువారై, వివేకశూన్యములగు మృగములవలె వేటిని స్వాభావికముగా ఎరుగుదురో వాటివలన తమ్మును తాము నాశనముచేసికొనుచున్నారు.

a. దూషించువారై: అపవాదిని కూడా దూషించని మిఖాయేలుకు విరుద్ధంగా, ఈ కొందరు మనుష్యులు దూషించారు, ముఖ్యంగా ప్రభుత్వమును నిరాకరించి మహాత్ములను దూషించినప్పుడు.

b. తాము గ్రహింపని విషయములనుగూర్చి: వారు దూషించిన విషయములు గాని లేదా మనుష్యులు గాని ఈ కొందరు మనుష్యులు గ్రహింపరు. వారి అజ్ఞానం వలన వారి దూషణ అధ్వాన్నంగా అయ్యింది.

  • వారు మహాత్ములను దూషించి ప్రభుత్వమును నిరాకరించినందున, ఈ కొందరు మనుష్యులకు నిజమైన ఆత్మీయ నాయకత్వం మరియు అధికారం తెలియదు – కాబట్టి వారిని దూషించడం సులభమైంది.

c. వివేకశూన్యములగు మృగములవలె వేటిని స్వాభావికముగా ఎరుగుదురో వాటివలన తమ్మును తాము నాశనముచేసికొనుచున్నారు: ఈ కొందరు మనుష్యులు ఆత్మీయులుగా నటించారు, కాని వారు ఎరిగినది స్వాభావికమైనది. వారు స్వాభావికముగా ఎరిగినది కూడా, ఆత్మీయత లేని మనస్సుతో తమ్మును తాము నాశనముచేసుకోడానికే ఉపయోగించారు.

  • సహజసిద్ధంగా వివేకశూన్యములగు మృగములు చురుకుగా తెలివిగా ఉంటాయి, అయితే స్పష్టంగా వాటికి ఆత్మీయ జ్ఞానం ఉండదు. ఈ కొందరు మనుష్యులు కూడా అలానే.
  • “మనుష్యులు తెలియని విషయాలలో వారు తెలివిగలవారని అనుకోవడం ఎంత హాస్యాస్పదం; ఒక సాధారణ మనిషికంటే గొప్పవారిగా వారనుకున్నప్పుడు, వారు మృగములతో సమానంగా ఉండి వారు వెదికే స్వాతంత్య్రంలో నశించిపోతున్నారు.” (గ్రీన్)

D. కొందరు మనుష్యులకు మూడు ఉదాహరణలు

1. (11a) కొందరు మనుష్యులు కయీను మార్గమున నడిచిరి

అయ్యో వారికి శ్రమ. వారు కయీను నడిచిన మార్గమున నడిచిరి,

a. కయీను నడిచిన మార్గము: ఆదికాండము 4లో కయీను గురించి ఉంటుంది. ఆదాము హవ్వల కుమారులు యెహోవాకు అర్పణను తీసుకొని వచ్చారు. కయీను (వ్యవసాయకుడై యుండి) పొలముపంటలో నుండి అర్పణ తెచ్చాడు. హేబెలు (గొర్రెల కాపరియై యుండి) తన మందలో నుండి అర్పణ తెచ్చాడు. దేవుడు హేబెలు అర్పణను లక్ష్యపెట్టాడు, కానీ కయీను అర్పణను లక్ష్యపెట్టలేదు.

  • హేబెలు రక్తముతో కూడిన అర్పణ, కయీను ధాన్యముతో కూడిన అర్పణ తీసుకొని వచ్చారు. రెండు అర్పణల్లో తేడా త్యాగపూరితమైన రక్తమని చాలా మంది ఊహించుకుంటారు. అయితే నిజమైన తేడా వారి విశ్వాసం అవిశ్వాసంలో ఉంది. హెబ్రీయులకు 11:4 ఇది స్పష్టం చేస్తుంది: విశ్వాసమునుబట్టి హేబెలు కయీనుకంటె శ్రేష్ఠమైన బలి దేవునికి అర్పించెను. దేవుడతని అర్పణలనుగూర్చి సాక్ష్యమిచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమునుబట్టి నీతి మంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతినొందియు ఆ విశ్వాసముద్వారా మాటలాడుచున్నాడు.
  • బహుశా మరణించిన గొర్రెపిల్ల మృతదేహం కంటే కయీను అర్పణ ఆహ్లాదకరంగా ఉండి ఉండవచ్చు. అయితే ఆయన అవిశ్వాసముతో అర్పించినందున, అది దేవునికి అంగీకారంగా లేదు. నీవు ఏమైయున్నవో, నీ దగ్గర ఏమి ఉందో, అది నీవు దేవునికి ఇవ్వవచ్చు కానీ, అది విశ్వాసంతో అర్పించాలి.

b. కయీను నడిచిన మార్గము: ఆదికాండము 4:5లో దేవుడు తన అర్పణను తిరస్కరించిన తరువాత, కయీనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొన్నాడు అని ఉంటుంది. దేవుడు తనను తిరస్కరించాడని తనకు తెలుసు కాబట్టి, తనకు కోపము వచ్చింది. ఆ క్షణికావేశంలో కయీను హేబెలును చంపి, దేవునితో అబద్ధమాడాడు.

  • 1 యోహాను 3:12లో కయీను క్రియలు చెడ్డవియు, హేబెలు క్రియలు నీతి గలవియునై యుండెను (విశ్వాసము వలన) గనుక కయీను తన సహోదరుని చంపెను అని ఉంటుంది. కయీను లోపము క్రియలలో కాదు గాని విశ్వాసంలో.

c. కయీను నడిచిన మార్గము: కొందరు మనుష్యులు నడిచే మార్గము కయీను నడిచిన మార్గము అని యూదా చెప్తున్నాడు. అది అసూయకు, నిజముగా దైవికమైన వారిని హింసించి దాని ద్వారా చంపేంత కోపమునకు నడిపించే అవిశ్వాస మార్గము.

  • పైకి భక్తిగలవారిగా ఉండడం కంటే ఈ లోకంలో గొప్ప శాపం ఏది లేదు. పైకి భక్తిగలవారివలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించనివారునై యుందురు (2 తిమోతి 3:5) ఇట్టివారికి విముఖుడవై యుండుము అని పౌలు చెప్పడంలో ఆశ్చర్యంలేదు.
  • మతానికి అతీతమైన మానవతావాదానికి, నాస్తికత్యానికి, లోకానికి చాలా మంది క్రైస్తవులు భయపడతాయారు. అయితే వీటన్నిటికంటే కూడా పైకి భక్తి కలిగి ఉండే మతం చాలా ప్రమాదకరమైనది, అదే ఎక్కువగా మనుష్యులను నరకానికి పంపిస్తుంది. ఈ కొందరు మనుష్యులు కయీను నడిచిన మార్గము ఉన్నారు, అదే పైకి భక్తి కలిగి ఉండే మతం.

2. (11b) కొందరు మనుష్యులు బిలాము నడిచిన తప్పుత్రోవలో ఉన్నారు.

బహుమానము పొందవలెనని బిలాము నడిచిన తప్పుత్రోవలో ఆతురముగా పరుగెత్తిరి,

a. బిలాము నడిచిన తప్పుత్రోవ: బిలాము గురించి సంఖ్యాకాండము 22 నుండి 25 మరియు 31లో ఉంది. నిర్గమకాండము సమయములో, ఇశ్రాయేలీయులు అమోరీయులను ఓడించిన తరువాత మోయాబు దేశమునకు వెళ్లారు. ఇశ్రాయేలీయులు దగ్గరకు వచ్చినప్పుడు, మోయాబు రాజైన బాలాకు బిలాము అనే ప్రవక్త సహాయం కోరాడు.

  • రాజైన బాలాకు నుండి మొదటి సారి వర్తమానము వచ్చింది. అయితే దేవుడు నీవు ఏమి చేయాల్సిన అవసరం లేదని చెప్పాడు. బిలాముతో దేవుని మొదటి మాటలు ఇవి, “అందుకు దేవుడునీవు వారితో వెళ్లకూడదు, ఆ ప్రజలను శపింపకూడదు, వారు ఆశీర్వదింపబడినవారు అని బిలాముతో చెప్పెను (సంఖ్యాకాండము 22:12)”.
  • ఆ మొదటి వర్తమానము తరువాత బహు ఘనత కలుగజేసే మరొక వర్తమానము వచ్చింది. బిలాము వారితో వెళ్లాలనుకున్నాడు అయితే దేవుడు అనుమతించాడు. బిలాము బహు ఘనత కలుగజేసే వెండి బంగారముకై ఆశించాడు అయితే దేవుడు అతనిని తన పాపమునకు అప్పగించాడు.
  • బిలాము బాలాకును చూడ బయలుదేరినప్పుడు దేవుడు వెనుకకు వెళ్ళమని హెచ్చరించాడు. అయినప్పటికీ తన హృదయం రాజైన బాలాకు వాగ్ధానం చేసిన ఘనమైన బహుమానం పైనే ఉంచి ముందుకు వెళ్ళాడు. బిలాము తనని వెనుకకు వెళ్ళమని హెచ్చరించడానికి పంపిన మాట్లాడే గాడిదను కూడా పట్టించుకోలేదు.
  • తాను తప్పు చేసినట్లు బిలాముకు తెలుసు. సంఖ్యాకాండము 22:34లో, నేను పాపముచేసితిని… నీ దృష్టికి చెడ్డదైతే నేను వెనుకకు వెళ్లెదనని యెహోవా దూతతో చెప్పాడు. కానీ వెనుకకు వెళ్ళలేదు. దేవుడు వద్దు అన్నప్పుడు, అది చెయ్యకూడదు అనే విషయాన్ని తిరస్కరించి ముందుకు వెళ్ళాడు. బదులుగా, బిలాము ఆశించిన తన పాప హృదయాన్ని దేవుడు ఇచ్చాడు.
  • మోయాబు రాజైన బాలాకుతో కలిసిన తరువాత, బిలాము ఇశ్రాయేలు గురించి నాలుగు సార్లు ప్రవచించాడు. అయితే తాను దేవుని మాట్లాడినందున, ఇశ్రాయేలును శపించలేదు – బదులుగా ప్రతీ సారి ఆశీర్వదించాడు. ఇశ్రాయేలును శపించడంలో విజయవంతం కానప్పుడు, ఇశ్రాయేలుకు ఏ విధంగా శాపం కలుగజేయాలో బాలకునకు సలహా ఇచ్చాడు. ఒక ప్రవక్త ఇశ్రాయేలును శపించడానికి ప్రయత్నించే బదులుగా, ఆ దేశమును వ్యభిచారమునకు విగ్రహారాధనకు నడిపించాలి అప్పుడు దేవుడే లోబడని ఇశ్రాయేలును శపిస్తాడు.
  • బాలాకు తన యవ్వన స్త్రీలను ఇశ్రాయేలు శిబిరానికి పంపి ఇశ్రాయేలీయులను వ్యభిచారం మరియు విగ్రహారాధనలోకి నడిపించి సరిగ్గా అదే చేసాడు. ఆ ప్రజల పాపమును బట్టి, దేవుడు ఇశ్రాయేలీయులను శపించి ఇశ్రాయేలీయుల పైన తెగులును పంపించి ఇరవై నాలుగువేల మందిని చంపాడు. కాబట్టి బిలాము ఆ గొప్ప పాపములకు దోషి. ఉద్దేశపూర్వకంగా ఇతరులను పాపములోకి నడిపించాడు. అది కూడా ధనం కోసం చేసాడు.

b. బహుమానము పొందవలెనని బిలాము నడిచిన తప్పుత్రోవలో: బహుమానము పొందవలెనని బిలాము నడిచిన తప్పుత్రోవ ఏదంటే ధనం కోసం ప్రతీ దానికి రాజీకి సిద్ధమవ్వడమే. యూదా హెచ్చరించిన ఆ కొందరు మనుష్యులు కూడా అదే హృదయాన్ని కలిగి యున్నారు.

  • చాలా మంది క్రైస్తవులు వారు హింసింపబడునప్పుడు యేసు ప్రభువును తిరస్కరించరు గాని, ధనాశ చూపినప్పుడు తిరస్కరించవచ్చు. అవినీతిపరుడు ధనం కోసం చేయని ఒక్క పాపము కూడా లేదు. అత్యాశ అనేది యేసు ప్రభువును చంపిన ప్రమాదకరమైన పాపము – యేసు ప్రభువును సిలువకు ఎక్కించడానికి ౩౦ వెండి నాణెములు సరిపోయాయి.
  • బహుమానము పొందవలెనని ఆతురముగా పరుగెత్తిరి అనగా “వారి హృదయములను కుమ్మరించారు” (రాబర్ట్సన్) అని అర్ధం. ఇది మితిమీరిన భోగానికి సాదృశ్యం. అయితే దేవుడు అమితముగా మనలను ప్రేమించే తీరును వివరించడానికి పౌలు ఇదే పదాన్ని ఉపయోగించాడు: దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడియున్నది (రోమీయులకు 5:5)

3. (11c) కొందరు మనుష్యులు కోరహు చేసిన తిరస్కారములో జీవించారు

కోరహు చేసినట్టు తిరస్కారము చేసి నశించిరి.

a. కోరహు చేసిన తిరస్కారము: కోరహు గురించి సంఖ్యాకాండము 16లో ఉంటుంది. అతను ఇశ్రాయేలీయులులో ప్రముఖమైన వ్యక్తి, అయితే ఒక రోజు మోషే వద్దకు వచ్చి మీతో మాకిక పనిలేదు; ఈ సర్వసమాజములోని ప్రతివాడును పరిశుద్ధుడే యెహోవా వారి మధ్యనున్నాడు; యెహోవా సంఘము మీద మిమ్మును మీరేల హెచ్చించుకొనుచున్నారనగా, (సంఖ్యాకాండము 16:3) దేవుడు మోషే అహరోనులకిచ్చిన అధికారము పై కోరహు అతని అనుసరులు ఆగ్రహపడిరి.

  • కోరహు చెప్పిన మాట విని, దేవుని తీర్పు వెంటనే రాబోతుందని తెలిసి మోషే సాగిలపడ్డాడు. అప్పుడు మోషే ఒక పరీక్షను ప్రతిపాదించాడు: రెండు గుంపులు ధూపార్తులను తీసికొని (ధూపద్రవ్యము మండించడానికి) యెహోవా సన్నిధికి వచ్చారు. ఎవరూ తనకు ప్రాతినిధ్యం వహించాలో మోషే కోరహులలో దేవుడే ఒకరిని ఎన్నుకుంటాడు.
  • వారు ఇరువురు దేవుని ముందుకు వచ్చినప్పుడు, దేవుడు మోషేను అవతలికి వెళ్లమని చెప్పాడు. అప్పుడు భూమి తన నోరు తెరచి కోరహును అతని సంబంధులందరిని మింగివేసెను. మరియు యెహోవా యొద్దనుండి అగ్ని బయలుదేరి అతని మద్దతుదారులందరిని కాల్చివేసెను. వారు అందరు నశించిరి.

b. తిరస్కారము : కోరహు లేవీయుడే కానీ అహరోను యొక్క యాజక కుటుంబానికి చెందినవాడు కాదు. లేవీయునిగా, దేవుడు తనకు అప్పగించిన పని ఉంది, అయినప్పటికీ తనకున్నదానిలో సంతృప్తి లేదు. మోషే యొక్క పరిచర్యను అధికారమును కావాలనుకున్నాడు.

  • కోరహు ఈ అవసరమైన పాఠాన్ని నేర్చుకోవలసియుంది: దేవుడు మనలను పిలిచినా ప్రతీ పనిని కష్టపడి పూర్తి చేయాలి. అదే సమయంలో, దేవుడు మనలను పిలవని పనిని చేయాలని ప్రయత్నించవద్దు.

c. కోరహు చేసిన తిరస్కారము: ఇది దేవుడు నియమించిన నాయకులను తిరస్కరించడము, ముఖమిగా దేవుడు నియమించిన మధ్యవర్తిని. కొందరు మనుష్యులు ప్రభుత్వమును నిరాకరించి మహాత్ములను దూషించినప్పుడు, కోరహు చేసిన తిరస్కారము మార్గములో నడిచారు.

  • “దేవుడు నియమించిన నిర్ణయాలకు వ్యతిరేకముగా ధిక్కరణ అనే ఆలోచన నుండి కోరహు చేసిన తిరస్కారము పుట్టింది.” (సాల్మండ్, ద పల్పిట్ కామెంటరీ)
  • ఈ ముగ్గురు మనుష్యులు వేరైన నేపథ్యాలనుండి వచ్చారు: కయీను ఒక వ్యవసాయకుడు, బిలాము ఒక ప్రవక్త, కోరహు ఇశ్రాయేలులో ఒక నాయకుడు. భ్రష్టత్వం అనేది ఒక గుంపుకు పరిమితమై యుండదు. “భ్రష్టులు పల్పిట్లో, భవనంలో, మరియు పాకలో ఉన్నారు” (కోడర్)

E. ఈ కొందరు మనుష్యుల భవిష్యత్తు ఎలా ఉండబోతుంది

1. (12-13) కొందరు మనుష్యుల అధోగతి యొక్క స్పష్టమైన వివరణ

వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయుచు, తమ్మును తాము నిర్భయముగా పోషించుకొనుచు, మీ ప్రేమవిందులలో దొంగ మెట్టలుగా ఉన్నారు. వీరు గాలిచేత ఇటు అటు కొట్టుకొనిపోవు నిర్జల మేఘములుగాను, కాయలు రాలి ఫలములు లేక, రెండు మారులు చచ్చి వేళ్లతో పెళ్లగింపబడిన చెట్లుగాను, 13 తమ అవమానమను నురుగు వెళ్లగ్రక్కువారై, సముద్రముయొక్క ప్రచండమైన అలలుగాను, మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు; వారికొరకు గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడి యున్నది.

a. మీ ప్రేమవిందులలో దొంగ మెట్టలు: ఆది క్రైస్తవులు అందరు కలిసి తినడానికి తరచుగా కలుసుకునేవారు, పాట్లక్ డిన్నర్ లాగ. వీటిని ప్రేమవిందులు లేదా “అగాపే విందులు” అని అనేవారు. ఈ కొందరు మనుష్యులు వచ్చినప్పుడు, తమ్మును తాము పోషించుకొనేవారు. వారు ప్రేమవిందులలో అత్యాశతో తినగా, ఇతరులు ఆకలితో వెళ్లేవారు.

  • అగాపే విందులో, ఎవరికి చేతనైనది వారు తెచ్చేవారు – కొంతమంది తక్కువ, మరి కొంతమంది ఎక్కువ; అయితే అందరు కలిసి పంచుకునేవారు. దాసులైన కొంత మంది క్రైస్తవులకు, వారు సరిగా తినే భోజనం అదే అయ్యి ఉండవచ్చు. ఈ కొందరు మనుష్యుల స్వార్ధం సహవాసాన్ని పాడుచేసింది.
    1 కొరింథీయులకు 11:17-34 కొరింథు సంఘంలో ఉన్న ఇలాంటి సమస్యను వివరిస్తుంది.
  • సంఘానికి స్వార్ధపు వైఖరితో వచ్చినప్పుడు, అది ఎప్పుడూ సహవాసాన్ని పాడుచేస్తుంది. సంఘ విందులో స్వార్ధంగా తినని చాలా మంది కూడా తమ్మును తాము పోషించుకొనే కారణంతోనే సంఘానికి వస్తారు.
  • మెట్టలు: గ్రీకు పండితులలో కొంతమంది ఈ పదాన్ని మెట్టలు బదులు “దాగియున్న రాళ్లు” అనాలని అంటారు. ఏ విధంగానైనా ఈ వాక్యభాగం యొక్క అర్ధం అయితే పెద్దగా మారదు.
  • తమ్మును తాము పోషించుకొనుచు: అక్షరాలా ప్రాచీన గ్రీకులో ఇది “తమ్మును తాము కాచుకునే కాపరులు” (రాబెర్ట్సన్). వారు ఒక రకమైన కాపరులు – అయితే తమ్మును తాము కాచుకునే కాపరులు.

b. గాలిచేత ఇటు అటు కొట్టుకొనిపోవు నిర్జల మేఘములుగాను: నిర్జల మేఘములు ఎందుకు పనికిరావు. జీవమునిచ్చే వర్షమును తీసుకొనిరాలేవు పైగా సూర్యునికి అడ్డుగా ఉంటాయి. అవి వాటి కోసం మాత్రమే ఉంటాయి. కొందరు మనుష్యులు ఈ మేఘముల వలె ఉన్నారు.

c. కాయలు రాలి ఫలములు లేక, రెండు మారులు చచ్చి వేళ్లతో పెళ్లగింపబడిన చెట్లుగాను: కొందరు మనుష్యులు ఎలాంటి ఫలములు లేక పెల్లగింపబడిన చెట్ల వలె ఉన్నారు.

d. సముద్రముయొక్క ప్రచండమైన అలలుగాను: ఆధునిక మానవునికి, సముద్రం అనేది ఒక అందమైన విషయం. కానీ ప్రాచీన మానవునికి, ముఖ్యంగా బైబిల్ సంస్కృతిలో. సముద్రం అనేది ఒక నియంత్రించలేని భీభత్సం. యెషయా 57:20 ఈ ఆలోచనను వ్యక్తపరుస్తుంది: భక్తిహీనులు కదలుచున్న సముద్రమువంటివారు అది నిమ్మళింపనేరదు దాని జలములు బురదను మైలను పైకివేయును. కొందరు మనుష్యులు సముద్రముయొక్క ప్రచండమైన అలలుగాను ఉన్నారు, అయితే తమ అవమానమను నురుగు వెళ్లగ్రక్కువారై యున్నారు.

  • బిజీగా ఉండడం ఎంతమాత్రము సరైనది కాదు. ఈ మనుష్యుల ఫలము సముద్రపు ఒడ్డున ఉండే నురుగు లాంటిది.

e. మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను: ఆకాశమునుండి పడే తోకచుక్కలవలె, ఈ కొందరు మనుష్యులు ప్రపంచాన్ని కొంత మట్టుకు ఆశ్చర్యపరచి, చీకటిలో కనుమరుగయ్యారు. ఒక అనూహ్యమైన చుక్క మార్గదర్శకత్వానికి గాని లేదా దారి చూపడానికి గాని పనికి రాదు. అదేవిధంగా ఈ మోసగాళ్లు కూడా పనికిరానివారు నమ్మదగనివారు.

f. నిరంతరము గాఢాంధకారము: వారి విధిని ఇది వివరిస్తుంది. వారు పశ్చాత్తాపపడితేనే తప్ప వారు నరకంలో ఉండిపోతారు – నిరంతరము.

  • నరకపు శిక్ష నిరంతరము ఎందుకంటే కేవలం ఒక మనిషి తన పాపములకు వెల చెల్లించి ఒక అసంపూర్ణమైన బలిని అర్పిస్తున్నాడు. అది నిత్యత్వము పునరావృత్తం అవ్వాలి. ఒక సంపూర్ణమైన మనిషి ఒక్క బలిని మాత్రమే అర్పించగలడు; కాని ఒక అసంపూర్ణమైన మనిషి బలిని అర్పిస్తూనే ఉండాలి
  • దేవునికి మన విధులు అనంతం కాబట్టి ఒక అనంత మనిషి అయిన యేసు ప్రభువులో మాత్రమే అవి నెరవేరుతాయి.

2. (14-15) ఈ కొందరు మనుష్యుల పైన తీర్పు తప్పనిసరి

ఆదాము మొదలుకొని యేడవ వాడైన హనోకు కూడ వీరినిగూర్చి ప్రవచించి యిట్లనెను ఇదిగో అందరికిని తీర్పు తీర్చుటకును, వారిలో భక్తిహీనులందరును భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చియు, భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటినిగూర్చియు వారిని ఒప్పించుటకును, ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను.

a. హనోకు కూడ: ఆదికాండము 5లో వివరించబడిన మరియు హెబ్రీయులకు 11లో ప్రస్తావించబడిన హనోకు గురించి యూదా ఇక్కడ చెప్తున్నాడు. హనోకు గురించిన ప్రాచీన పుస్తకం లేఖనంలో భాగం కాలేదు కానీ, అది యూదులలోను ఆది క్రైస్తవులలోను చాలా గౌరవప్రదమైనదిగా ఉంది.

b. అందరికిని తీర్పు తీర్చుటకును: చాలా మంది దేవునితీర్పును తేలికగా తీసుకుంటారు. అయితే ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే “దేవుడు నాకు తీర్పు తీరుస్తాడా? నేను దేవునికి లెక్క చెప్పాలా?” మనము నిజముగా దేవునికి లెక్క చెప్పవలసి వస్తే, ఆ తీర్పును ఎదుర్కోడానికి సిద్ధపడకపోతే మనం నిజంగా వెఱ్ఱివారము.

  • ఒక వ్యక్తి నేరం చేసి అరెస్ట్ అయ్యి, ఒక రోజు కోర్టు ముందు హాజరు కావలసి వచ్చి – జడ్జ్ ముందు హాజరు కావడానికి ఎలాంటి సిద్ధపాటు లేకపోతే ఎలా ఉంటాడో ఆలోచించండి. ఆ వ్యక్తిని వెఱ్ఱివాడు అంటారు. మనం అలా వెఱ్ఱివారివలె కాకుండా, కోర్టు నియమించిన న్యాయవాది అయిన యేసు క్రీస్తు (1 యోహాను 2:1) యొక్క సహాయాన్ని తీసుకోవాలి.

3. (16-18) కొందరు మనుష్యుల పద్ధతులు.

వారు తమ దురాశలచొప్పున నడుచుచు, లాభము నిమిత్తము మనుష్యులను కొనియాడుచు, సణుగువారును తమ గతిని గూర్చి నిందించువారునై యున్నారు; వారి నోరు డంబమైన మాటలు పలుకును. అయితే ప్రియులారా, అంత్యకాలమునందు తమ భక్తిహీనమైన దురాశలచొప్పున నడుచు పరిహాసకులుందురని మన ప్రభువైన యేసుక్రీస్తు అపొస్తలులు పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకము చేసికొనుడి.

a. మనుష్యులను కొనియాడుచు, సణుగువారును తమ గతిని గూర్చి నిందించువారునై యున్నారు; వారి నోరు డంబమైన మాటలు పలుకును: వారి పద్ధతులన్నీ మాటల చుట్టే ఉన్నాయని యూదా గమనించాడు. వారి ప్రశ్నార్థకమైన జీవితాలకంటే, ముఖ్యముగా వారు యేసు క్రీస్తు, అపొస్తలులు మరియు ప్రవక్తల పునాది నుంచి విడిపోతున్న మోసపూరితమైన ప్రజలు

b. సణుగువారును తమ గతిని గూర్చి నిందించువారునై యున్నారు: ఈ ప్రజలు సణుగువారు. ఎప్పుడైనా ఒక మనిషి దేవునికి దూరంగా వెళ్ళినప్పుడు, ఎదో ఒక విషయం గురించి సణుగుట ప్రారంభిస్తాడు అనేది గమనించదగ్గ విషయం.

  • సణుగుట అనేది మనకు సమస్తము సమకూర్చే దేవుడిని అవమానపరచుట; మనకు కలిగిన ప్రతీ దాన్ని మరిచిపోవుట.
  • “ఇక్కడ ప్రస్తావించబడిన ఈ రకమైన ప్రజలని ఏది తృప్తి పరచలేదు. వారు సువార్తతో కూడా అసంతృప్తి కలిగియున్నారు. జీవాహారము మూడు భాగాలుగా విభాగించి, అందమైన రుమాలులో పంచిపెట్టబడాలి, లేదంటే వారు తినరు; త్వరలోనే వారి ప్రాణము ఈ అల్పాహారాన్ని కూడా ద్వేషిస్తుంది. ఏ క్రైస్తవుడు కూడా వీరిని సంతోషపెట్టేంతగా దేవుని సేవించలేడు. ప్రతీ బోధకునిలో వీరు తప్పును వెతుకుతారు; ఒకవేళ ప్రధాన యాజకుడే ఇక్కడ ఉన్నా కూడా, తన మైమరువులో ఉన్న రాళ్ళ రంగు సరిగా లేదని అంటారు.” (స్పర్జియన్)

c. మనుష్యులను కొనియాడుచు: ఈ కొందరు మనుష్యులకు ఇతరుల వల్ల ప్రయోజనం కలిగేలాగున, సున్నితమైన, కొనియాడే మాటలు ఎలా వాడాలో తెలుసు. ప్రయోజనం కలుగు నిమిత్తం మంచైనా చెడైనా ఏదైనా చెప్పగలరు.

d. అయితే ప్రియులారాజ్ఞాపకము చేసికొనుడి: మనము వేరుగా ఉండాలి. యేసు ప్రభువు మరియు అపొస్తలులు ఏమి చెప్పారో గుర్తుంచుకోవాలి, మన ప్రభువైన యేసుక్రీస్తు అపొస్తలులు పూర్వమందు మీతో చెప్పిన మాటలను. సంఘం లోపల లేదా వెలుపల ఉన్న ప్రమాదాలకు దేవుని వాక్యమే సమాధానము.

  • సరిగ్గా ఈ విషయాలే జరుగుతాయని; సమయం వచ్చే కొద్దీ ఇంకా ఎక్కువ జరుగుతాయని అపొస్తలులు హెచ్చరించారు: ఎందుకనగా జనులు హితబోధను సహింపక, దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమకొరకు పోగుచేసికొని, సత్యమునకు చెవినియ్యక కల్పనా కథలవైపునకు తిరుగుకాలము వచ్చును. (2 తిమోతి 4:3-4)

e. అంత్యకాలమునందు పరిహాసకులుందురు: బహుశా, యూదా, యేసు ప్రభువు యొక్క రాకడను పరిహసించిన వారిని దృష్టిలో ఉంచుకొని ఉండవచ్చు. లేదా వారు ప్రయాణమయ్యే నాశనకరమైన మార్గంలో రానివారిని పరిహసించినది దృష్టిలో ఉంచుకొని ఉండవచ్చు.

  • తమ భక్తిహీనమైన దురాశలచొప్పున నడుచు పరిహాసకులు: తమ భక్తిహీనమైన దురాశలచొప్పున జీవించేవారు, దేవుడిని సంతోషపెట్టేవారిని పరిహసించడానికి ఇష్టపడతారు. క్రైస్తవులు ఇలాంటి పరిహాస్యము వచ్చినప్పుడు ఆశ్చర్యపడకూడదని యూదా కోరుకుంటున్నాడు.

4. (19) ఈ కొందరు మనుష్యుల ఆత్మీయ స్థితి.

అట్టివారు ప్రకృతి సంబంధులును ఆత్మ లేనివారునైయుండి భేదములు కలుగజేయుచున్నారు.

a. అట్టివారు ప్రకృతి సంబంధులు: ముఖ్యంగా ఈ మనుష్యులు ఆత్మానుసారులు కాదు; వారు శరీరానుసారులై పరిశుద్ధాత్మను దుఃఖపరిచేవారు.

  • ఈ సందర్భంలోప్రకృతి సంబంధులకు లైంగిక ఆకర్షణకు ఎలాంటి సంబంధం లేదు. ఇది కేవలం శరీరముతో, శరీరము కోసం జీవించే వ్యక్తిని గూర్చి వివరిస్తుంది. ఆ విధంగా ఆ వ్యక్తి స్వార్ధంతో జీవిస్తాడు. “ఒకవేళ మంచిగా అనిపిస్తే చెయ్యి” లేదా “ఇంత సరిగా అనిప్పిస్తుంది ఇది తప్పేలా అవుతుంది” అనేవే తన నినాదాలు.

b. భేదములు కలుగజేయుచున్నారు: ఈ కొందరు మనుష్యులు తమ్మును వేరు చేసుకొని భేదములు కలిగిస్తారు. “తమను తమకే ఉంచుకునే ఈ ఉన్నతమైన ప్రజల గురించిన పదం బైబిల్ లో ఒక్కసారే రాయబడింది” (గ్రీన్)

c. ఆత్మ లేనివారునైయుండి: ఇదే వివరణ అనేక సంఘాల గురించి, సంఘ సంస్థల గురించి, సువార్త ప్రచారాల గురించి, ఇళ్లల్లో కలుసుకునే గుంపుల గురించి, లేదా వ్యక్తిగత క్రైస్తవ జీవితాల గురించి రాయబడింది. ఈ రోజు సంఘానికి మరియు లోకానికి నిజమైన ఆత్మానుసారులైన పురుషులు స్త్రీలు కావాలి.

F. కొందరు మనుష్యుల వల్ల కలిగే ప్రమాదం గురించి ఏం చెయ్యాలి.

ప్రాముఖ్యంగా, సంఘానికి ప్రమాదమైన వారిని దాడి చెయ్యమని యూదా మనకు చెప్పట్లేదు. బదులుగా, ప్రభువుతో మన నడకపైన దృష్టిని ఉంచి, ఆ మనుష్యుల వలన ప్రభావితమైన వారికి దేవుని పైన దృష్టిని ఉంచే లాగున సహాయం చేయమని చెప్తున్నాడు. మనం కేవలం మన హెచ్చరికకు అవసరమైనది తప్ప అలాంటి మనుష్యుల పైన అశ్రద్ధ చూపాలి. దేవుడే వారిని చూసుకుంటాడు.

1. (20-21) మనసులోకి చూడండి

ప్రియులారా, మీరు విశ్వసించు అతిపరిశుద్దమైనదానిమీద మిమ్మును మీరు కట్టుకొనుచు, పరిశుద్ధాత్మలో ప్రార్థనచేయుచు, నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరముకొరకు కనిపెట్టుచు, దేవుని ప్రేమలో నిలుచునట్లు కాచుకొని యుండుడి.

a. దేవుని ప్రేమలో నిలుచునట్లు కాచుకొని యుండుడి: దేవుడు భక్తిహీనులను కూడా ప్రేమిస్తాడని మనకు తెలుసు (రోమీయులకు 5:6). అందువలన “దేవుని చేత ప్రేమించబడే లాగున జీవించండి” అనేది యూదా యొక్క అర్ధం కాదు. బదులుగా, దేవుని ప్రేమలో నిలుచునట్లు అంటే దేవుని నిత్య ప్రేమతో సామరస్యంగా ఉండాలి.

  • అయితే దేవుడు భక్తిహీనులను ప్రేమిస్తాడు అని బైబిల్ చెప్పినప్పుడు దాని అర్ధం ఏంటో మనం తెలుసుకోవాలి. దేవుడు మనందరిని ప్రేమిస్తాడు అనే ఆలోచన యొక్క ప్రాముఖ్యత గణనీయంగా వక్రీకరించబడింది. “నేను ఉన్నలాగానే దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు” అని ఒక పాపి తన పాప ప్రవర్తనను అలానే కొనసాగించాడనుకోండి. ఆయన అర్ధం ఏంటంటే “దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడంటే, నేను చాలా మంచివాడిని అయ్యుండాలి”. నిజానికి, దేవుడు తనను ప్రేమిస్తున్నాడు అనేది దేవుని యొక్క మంచితనమును ప్రతిబింబిస్తుంది కానీ తన సొంత మంచితనమును కాదు. “దేవుడు కూడా నన్ను ప్రేమించేంత గొప్పవాణ్ణి నేను” అనే దృక్పథం కాదు గాని “నన్ను కూడా ప్రేమించేంత గొప్పవాడు దేవుడు” అనేది.
  • దేవుని ప్రేమ ప్రతిచోట విస్తరించింది, ఆ ప్రేమనుండి ఏది మనలను వేరు చేయలేదు. అయితే దేవుని ప్రేమ వలన కలిగే ఉపయోగాలను మనకి మనమే నిరాకరించవచ్చు. దేవుని ప్రేమలో నిలువలేని ప్రజలు చంద్రునికి చీకటి వైపు ఉన్నట్లుగా జీవిస్తారు. సూర్యుడు ఎప్పుడూ ప్రకాశిస్తూ ఉంటాడు, అయితే వారు దాని వెలుగును లేదా వేడిని పొందుకొనే స్థితిలో ఎప్పుడూ ఉండరు. దీనికి ఉదాహరణ తన తండ్రి చేత ఎప్పుడూ ప్రేమించబడినా కొంత కాలం దానినుండి ఉపయోగం పొందనటువంటి లూకా లోని తప్పిపోయిన కుమారుడు

b. మీరు విశ్వసించు అతిపరిశుద్దమైనదానిమీద మిమ్మును మీరు కట్టుకొనుచు: దేవుని ప్రేమలో నిలిచియుండడానికి ఇది ఒక మార్గం. దాని అర్ధం ఆత్మీయంగా ఎదుగుతూ, కట్టుకొంచు ఉండడం. “మీరు విశ్వసించు అతిపరిశుద్దమైనదానిమీద మిమ్మును మీరు కట్టుకొమ్మని యూదా చెప్తున్నాడు. దాని అర్ధం మన ఆత్మీయ ఎదుగుదలకి మనమే బాధ్యులం. అంటే మన ఆత్మీయ ఎదుగుదల దానంత అదే అవుతుందని ఎదురు చూడకూడదు లేదా ఇతరులు మనలను ఎదిగిస్తారని ఆశించకూడదు.

  • మనుష్యులు ఎంత బలహీనులో, మోసగాళ్లు సంఘంలోకి ఎలా చొరబడ్డారో యూదా చూపించాడు. మీ ఆత్మీయ ఎదుగుదలను ఇతరులకు అప్పగిస్తే, అది మీ ఆత్మీయ ఎదుగుదలను గాయపరచడమే కాకుండా మిమ్మల్ని దారి తొలిగేలా చేస్తుంది.
  • ఇతరులు ఆత్మీయ ఎదుగుదలకు అనుకూలమైన వాతావరణాన్ని మాత్రమే కలుగజేయగలరు. కానీ ఒక్కరు కూడా ఒక వ్యక్తికి ప్రభువుతో తనకున్న సంబంధాన్ని ఎదిగేలా చేయలేరు.
  • మీరు విశ్వసించు అతిపరిశుద్దమైనదానిమీద: విశ్వసించు అతిపరిశుద్దమైనది పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ (యూదా 1:3) రెండు ఒక్కటే. విశ్వసించు అతిపరిశుద్దమైనదానిలో ఎదగడం గురించి యూదా మాట్లాడట్లేడు (అది సరైన ఆలోచన అయినప్పటికీ). విశ్వసించు అతిపరిశుద్దమైనదానిమీద ఎదగడం గురించి మాట్లాడుతున్నాడు. మనము సత్యమనే పునాది మీద ఎదగాలి.

c. పరిశుద్ధాత్మలో ప్రార్థనచేయుచు: దేవుని ప్రేమలో మనలను నిలుపుకోడానికి ఇది ఇంకొక మార్గం. తప్పుడు బోధ మరియు తప్పుడు జీవనం పైన జరిగే యుద్ధమైన ఆత్మీయ యుద్ధమునకు పరిశుద్ధాత్మలో ప్రార్ధన అవసరం.

  • చాలా సార్లు, మన సొంత అవసరాలు, మన సొంత తెలివి, మన సొంత కోరికలు మరియు ఆశలు మన ప్రార్థనలను నిర్దేశిస్తాయి. అయితే ఉన్నతమైన ప్రార్ధన ఒకటి ఉంది: అటువలె ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఏలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని, ఉచ్చరింప శక్యముకాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు (రోమీయులకు 8:26).
  • మనము ప్రార్ధించినప్పుడు, మనకు సరియైన మాటలు దయచేయడం ద్వారా పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేస్తాడు. ఉచ్చరింప శక్యముకాని మూలుగులతో ఆయన మాట్లాడుతాడు (రోమీయులకు 8:26). లేదా దేవునితో లోతైన సంభాషణ చేయడానికి తనను వెదికే హృదయాలకు దేవుడు ఇచ్చే భాషల వరం ద్వారా పరిశుద్ధాత్ముడు చేస్తాడు.
  • “దేవుని ఆత్మచేత నింపబడితే తప్ప సరిగా ప్రార్ధించలేనంత, అనగా ఆత్మ నడిపింపు ఉంటే తప్ప మనము ప్రార్ధించవలసినది ప్రార్ధించలేనంతగా ఉంది మన బద్దకం మరియు మన శరీరము యొక్క చల్లదనం.” (కాల్విన్)

d. నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరముకొరకు కనిపెట్టుచు: దేవుని ప్రేమలో మనలను నిలుపుకోడానికి ఇది మూడో మార్గం. మన హృదయాల్లో యేసు ప్రభువు యొక్క రాకడ అనే శుభప్రదమైన నిరీక్షణను నిలుపుకున్నప్పుడు, అది మనలను దేవుని ప్రేమలో నిలిపి మన విశ్వాసాన్ని కోల్పోకుండా ఉండడానికి సహాయపడుతుంది.

2. (22-23) బయటకు, మీ చుట్టూ ఉన్నవారిని చూడండి.

సందేహపడువారిమీద కనికరము చూపుడి. అగ్నిలోనుండి లాగినట్టు కొందరిని రక్షించుడి, శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏ మాత్రము నొప్పుకొనక దానిని అసహ్యించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి.

a. సందేహపడువారిమీద కనికరము చూపుడి: ఈ కొందరు మనుష్యుల ద్వారా ప్రభావితమైన వారితో మనం ఎలా ఉండాలి అనేది యూదా ఇక్కడ చెప్తున్నాడు. వారి ప్రవర్తనకు ఏ మాత్రము నొప్పుకొనకుండా ఖచ్చితముగా కొందరిని కనికరించాలి.

  • జ్ఞానము చేత ఒక్కొక్కరికి ఒక్కో పద్దతిని ఉపయోగించాలి. పరిశుద్ధాత్ముని సహయాంతో, ఎప్పుడూ ఆదరించాలో, ఎప్పుడు గద్దించాలో మనకు తెలుస్తుంది. క్రైస్తవులు అబద్ధ బోధతో మోసపోయే స్నేహితుడిని విడిచిపెట్టకూడదు. ప్రేమతో వారికి సహాయం చేయాలి.
  • అంటే వారిని ప్రేమిస్తూనే ఉండాలి. ఆ వ్యక్తి ఎంత చెడ్డవాడైనప్పటికీ లేదా వారి బోధ ఎంత తప్పుదారిలో ఉన్నప్పటికీ, వారిని ద్వేషించే అనుమతి గాని వారి రక్షణను పట్టించుకోకుండా ఉండే అనుమతి గాని మనకు లేదు .
  • చాలా సార్లు కరుణ అంటే ఇతరులను కనిపెట్టుకొని, వారి జవాబుదారీతనమునకు సహాయపడడం. “ఈలోగా ఇతరులతో పాటు మిమ్మును కూడా కనిపెట్టుకోండి; అలాగే వారి అనేక అవసరాల నిమిత్తం వారికి కావాల్సిన సహాయాన్ని ఇవ్వండి” (వెస్లీ)

b. భయముతో కొందరిని కరుణించుడి: ఈ రెండవ గుంపును ఇంకా బలంగా ఎదుర్కోవాలి – అయితే పవిత్రమైన ఆధిక్యతతో కాక భయముతో చేయాలి. అగ్నిలోనుండి లాగినట్టు వారిని రక్షించాలి అయితే గర్వంతో మాత్రం చేయకూడదు.

  • ఈ బాహ్య చూపు ప్రాముఖ్యమైనది. మన ఆత్మీయ సంక్షేమానికి మాత్రమే కాక తప్పుడు దారి అంచుల్లో ఉన్న వేరే క్రైస్తవుల పట్ల యదార్ధంగా శ్రద్ధ తీసుకుంటున్నామనేది వెల్లడిపరుస్తుంది.

3. (24-25) సమస్త మహిమాన్వితుడైన దేవుడి వైపు పైకి చూడండి

తొట్రిల్లకుండ మిమ్మును కాపాడుటకును, తన మహిమ యెదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులనుగా నిలువబెట్టుటకును, శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి, మన ప్రభువైన యేసు క్రీస్తుద్వారా, మహిమయు మహాత్మ్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములును కలుగును గాక.

a. యూదా ఈ పత్రికను ప్రసిద్ధిగాంచిన క్లుప్తమైన దేవుని స్తుతితో ముగించాడు. దేవుని పనిని మన గమనాన్ని ఇది గుర్తుచేస్తుంది.

b. తొట్రిల్లకుండ మిమ్మును కాపాడుటకునుమిమ్మును నిర్దోషులనుగా నిలువబెట్టుటకును శక్తిగల దేవునికి: యూదా యొక్క హెచ్చరికతో కూడిన వర్తమానము తన పాఠకులను నిరాశపరచియుండవచ్చు. బహుశా తన అసలైన పాఠకులు చుట్టూ ఉన్న అబద్ధ బోధ మరియు అపవిత్రత వాళ్ళ కొందరు క్రైస్తవులు మాత్రమే పరలోకానికి చేరుకుంటారని అనుకున్నారు. ఇక్కడ దాని జవ్వాబు దేవుని యొక్క శక్తిలో ఉందని వారికి గుర్తుచేస్తున్నాడు. దేవుడే మిమ్మును కాపాడుటకు శక్తిగలవాడు, మిమ్మును మీరు కాపాడుకొనలేరు.

  • లేఖన భాగాలను పోల్చిచూడడం ద్వారా, మనలను కాపాడుటకు నిజమైన బాధ్యులు ఎవరు అనేది తెలుస్తుంది. యేసుక్రీస్తునందు భద్రము చేయబడిన వారికి అని యూదా ఈ పత్రికను ప్రారంభించాడు (యూదా 1). తరువాత ప్రమాదకరమైన మనుష్యులనుండి తప్పించుకొని దేవుని ప్రేమలో నిలిచియుండమని (యూదా 21) బోధించాడు. చివరగా ఇక్కడ మనం పడిపోకుండా నిలువబెట్టేది దేవుడే అనే విషయాన్ని గుర్తు చేస్తూ ముగించాడు . ఫిలిప్పీయులకు 2:12-13లో పౌలు సరిగ్గా ఇదే ఆలోచనను పంచుకున్నాడు: భయముతోను వణకుతోను మీ సొంతరక్షణను కొనసాగించుకొనుడి. ఎందుకనగా మీరు ఇచ్ఛయించుటకును కార్యసిద్ధి కలుగజేసికొనుటకును, తన దయాసంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే.
  • మనలను ఆత్మీయంగా క్షేమంగా ఉంచేది దేవుని ఈపని. అయితే దేవుడు పని చేస్తున్నాడు అని మీరు ఇతరులకు చెప్పవచ్చు ఎందుకంటే వారు కూడా పనిచేస్తున్నారు కాబట్టి. క్రైస్తవ జీవితం ఊరికే అలా జరిగిపోతుందని దేవుడు మనలను పిలవలేదు మరియు మనలను మనం రక్షించుకోడానికి ఆయన మనకు ఆజ్ఞాపించలేదు. ఆయనతో భాగస్వామ్యానికి ఆయన మనలను పిలిచాడు.

c. తన మహిమ యెదుట ఆనందముతో: దేవుడు నమ్మదగినవాడు కాబట్టి, అవమానకరంగా దేవుని సన్నిధిలోకి రహస్యంగా రావడం అవసరం లేదు. ఆనందముతో ఆయన ఎదుటికి మనం రావొచ్చు.

d. శక్తిగల అద్వితీయ దేవునికి… మహిమయు మహాత్మ్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములును కలుగును గాక: దేవుని యొక్క జ్ఞానమును, మహిమయు, అధికారమును ఇది గుర్తు చేస్తుంది. మనము ఇవన్నీ దేవునికి ఇవ్వగలమానో ఇవ్వాలనో యూదా చెప్పట్లేదు. మనము సత్యమును గుర్తించి ప్రకటించినప్పుడు, అది దేవుడిని మహిమపరుస్తుంది. దేవునికి ఉన్న మహాత్మ్యము, అధికారము కంటే ఎక్కువగా మనమేమి ఇవ్వట్లేదు గాని, కేవలం గుర్తించి ప్రకటిస్తున్నాము.

  • యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములును: దీని అర్ధం “అన్ని యుగాలకు” అని. ఇది “మానవ భాషలో నిత్యత్వాన్ని వివరించగలిగే పరిపూర్ణమైన ప్రకటన” (రాబర్ట్సన్). మన విజయం, మన గెలుపు ఎప్పటికీ దేవునిలోనే.
  • లోకంలో తీవ్రమైన మోసం ఉంది, చాలా సార్లు ఇది క్రైస్తవులు అని పిలువబడే వారిలోనే ఉంది. సంఘంలోకి చొరబడిన సువార్త శత్రువులు ఉన్నారు. అయితే ఆ అపాయము ఎంత గొప్పదైనప్పటికీ, దేవుడు అంతకంటే గొప్పవాడు. ఆయన గెలుస్తాడు, మనం ఆయనతో ఉంటే చాలు, మనకు కూడా గెలుపు తప్పనిసరి.
  • యూదా పత్రిక హెచ్చరికలతో నిండి ఉన్నప్పటికీ దేవునిలో ఉన్న మహిన్నతమైన ధైర్యంతో ముగిస్తుంది. అపాయకరమైన సమయాలు మనలను గొప్ప దేవుని విశ్వసించేలా చెయ్యాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *